Begin typing your search above and press return to search.

ఉత్తమ్ బట్టేబాజ్.. రేవంత్ బచ్చగాడు..

By:  Tupaki Desk   |   15 Sept 2018 1:49 PM IST
ఉత్తమ్ బట్టేబాజ్.. రేవంత్ బచ్చగాడు..
X
టీఆర్ ఎస్ సీనియర్ నేత ప్రస్తుత హోమ్ మినిస్టర్ నాయిని నర్సింహారెడ్డి సంచలన కామెంట్స్ చేశాడు. పీసీపీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి - కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి పై పరుష విమర్శలు చేశారు. ఇప్పుడీ మాటలు దుమారం రేపాయి.

నాయిని మాట్లాడుతూ.. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓ బట్టేబాజ్ అని.. రేవంత్ రెడ్డి ఓ ‘బచ్చగాడు’ అని విమర్శించారు. 2004లోనే నకిలీ పాస్ పోర్టుల కుంభకోణంలో కాంగ్రెస్ నేతలు ఇరుక్కుపోయారని.. వారిని అప్పుడే టీఆర్ఎస్ ప్రశ్నించదని విమర్శించారు. జగ్గారెడ్డి పేరు ఇందులో ప్రముఖంగా ప్రస్తావించారని.. అందుకే ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారని వివరించారు. ఆ కేసులో సంబంధం లేకున్నా కేసీఆర్ - హరీష్ రావులను ఇరికిస్తున్నారని కాంగ్రెస్ నేతలపై మండిపడ్డారు.

జగ్గారెడ్డి అరెస్ట్ తర్వాత అవాకులు చెవాకులు పేలుతున్నారని.. కాంగ్రెస్ నేతలను అరెస్ట్ లతో భయపెట్టే అవసరం టీఆర్ ఎస్ కు లేదని నాయిని స్పష్టం చేశారు. ఒకవేళ కాంగ్రెస్ నేతలపై ప్రతీకారమే ప్లాన్ చేస్తే.. ఉత్తమ్ కుమార్ రెడ్డిని జైలుకు పంపించే వాళ్లమని చెప్పారు. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు చేసిన హౌసింగ్ స్కామ్ లో జైలుకు పోతాడో.. లేక బయట ఉంటాడో తేల్చుకోవాలని నాయిని హెచ్చరించారు.