Begin typing your search above and press return to search.

16 మంది గ్రామస్తులను కిరాతకంగా చంపేసిన మావోయిస్టులు !

By:  Tupaki Desk   |   26 Sept 2020 8:56 PM IST
16 మంది గ్రామస్తులను కిరాతకంగా చంపేసిన మావోయిస్టులు !
X
కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో అందరూ ఈ మహమ్మారిపై దృష్టి సారించిన సమయంలో మావోయిస్టులు మాత్రం వారి కార్యకలాపాల్లో వేగం పెంచారు. మావోయిస్టుల కదలికలు పెరిగిన నేపథ్యంలో వారికోసం ప్రత్యేక సాయుధ బలగాలు, పోలీసులు కూంబింగ్ ముమ్మరం చేశారు. అడవులను జల్లెడ పడుతున్నారు. మ‌రోవైపు, ఛ‌త్తీస్ ‌గ‌ఢ్ ‌లోని బీజాపూర్ జిల్లా గంగ‌లూర్ ప‌రిధిలో మావోయిస్టులు దారుణానికి ఒడిగట్టారు. కుర్చేలి గ్రామానికి చెందిన 16 మంది వ్య‌క్తుల‌ను మావోయిస్టులు హ‌త‌మార్చారు. ఈ మధ్య 25 మంది గ్రామస్తులను మావోయిస్టులు అపహరించారు. ఆ తర్వాత ప్రజా కోర్టు నిర్వహించి నలుగురి గొంతులు కోసి హతమార్చారు.

ఆ తరువాత ఐదుగురిని విడుదల చేశారు. తమ ఆధీనంలోనే ఉంచుకున్న మిగతా 16 మందిని ఈరోజు హత్య చేసినట్టు తెలుస్తోంది. ఈ వార్తతో బాధిత కుటుంబాలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయి.అలాగే , ఈ తరహా ఘ‌ట‌నే సెప్టెంబ‌ర్ 5వ తేదీన బీజాపూర్ జిల్లాలో చోటు చేసుకుంది. మోట‌పాల్ , పూనూర్ స‌మీపంలో గతంలో న‌లుగురు వ్య‌క్తుల‌ను హ‌త‌మార్చారు మావోయిస్టులు, ఇప్పుడు ఏకంగా 16 మందిని పొట్ట‌న‌బెట్టుకున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.. ఇలా.. మొత్తం 20మందిని మావోయిస్టులు హ‌త్యచేయ‌డం క‌ల‌క‌లం సృష్టిస్తోంది.