Begin typing your search above and press return to search.

చంపినోళ్ల పక్కన కూర్చుంటావా సిద్దూ..

By:  Tupaki Desk   |   20 Aug 2018 8:53 AM GMT
చంపినోళ్ల పక్కన కూర్చుంటావా సిద్దూ..
X
ఆయనో వివాదాస్పద క్రికెటర్.. ఆ తర్వాత అంతే వివాదాలతో కాలం గడుపుతున్న రాజకీయ నాయకుడు కూడా.. ప్రతి చేష్టలోనూ వివాదాన్ని కొనితెచ్చుకునే నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఇప్పుడు మరో వివాదంలో చిక్కుకున్నారు. ఏకంగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ను కౌగిలించుకొని దుమారం రేపాడు. అంతేకాదు.. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ చీఫ్ పక్కన కూర్చోవడంపై విమర్శలు చెలరేగాయి.

వాజ్ పేయి మరణంతో దేశవ్యాప్తంగా సంతాప దినాలు వ్యక్తమవుతున్నాయి. పాకిస్తాన్ ఆర్మీ చేతుల్లో ఎంతో మంది భారత జవాన్లు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకారానికి సిద్ధూ వెళ్లడమే పెద్ద తప్పుగా అందరూ భావించారు. కానీ అక్కడికి వెళ్లి ఏకంగా పాకిస్తాన్ ఆర్మీచీఫ్ ను కౌగిలించుకోవడం.. ముచ్చట్లు పెట్టడం..పాక్ఆక్రమిత కాశ్మీర్( పీఓకే) చీఫ్ పక్కనే కూర్చోవడంపై బీజేపీ సహా వివిధ పార్టీల నేతలు, ప్రముఖులు, సామాన్యులతోపాటు సిద్దూ ప్రాతినిధ్యం వహిస్తున్న అకాలీదల్ అధినేత, ముఖ్యమంత్రి అమరీందర్ కూడా భగ్గుమన్నాడు. ‘పాక్ ఆర్మీ చీఫ్ పట్ల అంత వాత్సల్యం సరికాదు.. మన జవాన్లు అమరలవుతున్న విషయం గుర్తుపెట్టుకోవాలలి’ అని ఘాటుగా బదులిచ్చాడు.

ఇక కార్యక్రమం ముగిశాక వాఘా సరిహద్దు గుండా భారత్ లోకి ప్రవేశించిన సిద్దూకు నిరసన తెగ తగిలింది. తనపై వస్తున్న విమర్శలకు స్పందించారు. పాక్ ఆర్మీ చీఫ్ తనను గురునానక్ జయంతికి పాకిస్తాన్ లోని కర్తార్ పూర్ షాహిబ్ గురుద్వారాకు రమ్మన్నారని ఇందులో తప్పేముందో అర్థం కావడం లేదన్నారు. పీఓకే చీఫ్ పక్కన తనకు సీటు కేటాయిస్తే తాను ఏం చేయగలుగుతానని ప్రశ్నించారు. కాగా సిద్ధూ రాక సందర్భంగా పగ్రీ సంబాల్ అనే సంస్థ కార్యకర్తలు ఆయనకు వ్యతిరేకంగా ఫ్లకార్డులు ప్రదర్శించారు. నల్ల జెండాలతో సిద్ధూకు నిరసన తెలిపారు.