Begin typing your search above and press return to search.

ఈ తండ్రి గురించి కేసీఆర్ కు తెలిస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో?

By:  Tupaki Desk   |   31 May 2021 11:00 AM IST
ఈ తండ్రి గురించి కేసీఆర్ కు తెలిస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో?
X
అమ్మాయి పుడితే ఆవేదన చెందటం.. దారుణాలకు పాల్పడటం లాంటివి ఇప్పటికి చోటు చేసుకుంటున్నా.. గతంతో పోలిస్తే చాలానే మార్పు వచ్చింది. అబ్బాయి.. అమ్మాయి అన్న తేడా లేకుండా ఎవరు పుట్టినా ఓకే అనే తల్లిదండ్రులు ఈ మధ్యన ఎక్కువ అయ్యారు. కొందరైతే.. తమకు అబ్బాయి కంటే కూడా అమ్మాయి పుట్టాలని కోరుకునే వారు ఇప్పుడు పెరిగారు. ఇదిలా ఉంటే.. తాజాగా సిద్దిపేట జిల్లా ఖానాపూర్ లో నవీన్ అనే యువకుడికి ఆడపిల్ల పుట్టింది. తన ఇంట్లో మహాలక్ష్మీ పుట్టిందంటూ సంతోషాన్ని వ్యక్తం చేయటమే కాదు.. అతగాడు చేసిన పనికి అందరూ అతన్ని అభినందిస్తున్నారు.

ఖానాపూర్ కు చెందిన మరబోయిన నవీన్ దంపతులకు అమ్మాయి పుట్టింది. ఆ ఆనందాన్ని ఊరి ప్రజలతో పంచుకోవాలని భావించాడు. అంతే.. ఊర్లోని 300 కుటుంబాలకు నాలుగైదు రోజులకు సరిపడా కూరగాయల్ని పంచాడు. కరోనా వేళ.. అందునా లాక్ డౌన్ వేళ ఊళ్లోని ప్రతి ఇంటికి ఇలా కూరగాయలు పంచటం తనకెంతో ఆనందాన్ని కలిగించిందన్న మాటకు పలువురు అభినందిస్తున్నారు. కరోనా వేళ ఇలా సేవ చేసే అదృష్టం తనకు దక్కిందన్నాడు.

సంతోషకరమైన వార్త తెలిసినంతనే దావత్ అంటూ డబ్బులు వేస్ట్ చేసే కంటే.. అందరికి ఉపయోగపడేలా ఇలా కూరగాయల్ని పంచే ఆలోచన వినూత్నమని అభినందిస్తున్నారు. నవీన్ చేసిన పని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలిస్తే తెగ ఖుషీ అవుతారని చెబుతారు.

ఎందుకంటే.. కేసీఆర్ కు సైతం ఆడపిల్లలకు ప్రత్యేకమైన ప్రాధాన్యతను ఇస్తారు. తన ఇంటి విషయానికి వస్తే.. ఇంట్లో కొడుకు కేటీఆర్.. కుమార్తె కవిత ఉన్నప్పటికీ.. కూతురంటే ప్రత్యేకమైన అభిమానంగా చెబుతారు. అలాంటిది ఆడపిల్ల పుట్టిందని ఒక మారుమూల గ్రామానికి చెందిన తండ్రి చేసిన పనికి కేసీఆర్ తప్పక హ్యాపీగా ఫీల్ అవుతారని ఆయన సన్నిహితులు వ్యాఖ్యానించటం గమనార్హం.