Begin typing your search above and press return to search.

మానవాళికి పొంచి ఉన్న పర్యావరణ ముప్పు

By:  Tupaki Desk   |   31 Dec 2018 9:33 AM GMT
మానవాళికి పొంచి ఉన్న పర్యావరణ ముప్పు
X
ప్రపంచ పర్యావరణానికి భారీ ముప్పు పొంచి ఉంది. రోజురోజుకు పెరుగుతున్నకాలుష్యంతో మానవాళి మనుగడ ప్రశ్నార్థకమవుతోంది. ఏటా ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మినహా కాలుష్యం పై అవగాహన, అమలు వంటి కార్యక్రమాలు ఎక్కడా కనిపించడం లేదు. పెరుగుతున్న ప్లాస్టిక్ వినియోగం మానవాళిని కబళిస్తుందనడంలో మాత్రం ఎలాంటి సందేహామూ లేదు. వాతావరణంలో వస్తున్న మార్పులు, ప్రకృతి వైపరిత్యాలు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. తరచూ వేదికల పై ఉపన్యాసాలు దంచుతున్న నాయకులు అనంతరం పట్టించుకోవడం లేదు. తాజాగా ముగిసిపోతున్న 2018కి సంబంధించి ఓ పత్రిక స్ట్రైకింగ్ ఫొటోలను ప్రచురించింది.

*అప్రత్తమవ్వండి.. చిన్నారి నిరసన
వాతావరణంలో వస్తున్న మార్పులు, గ్లోబల్ వార్మింగ్ పై ఇప్పటికైనా అప్రమత్తం కావాలని స్వీడన్ లో పార్లమెంట్ బయట 15 ఏళ్ల గ్రెటా వినూత్న రీతిలో నిరసన తెలిపింది. ఇప్పటికైనా పాలకులు మేలుకోవాలని, లేని పక్షంలో ముప్పు తప్పదని హెచ్చరించింది. ప్రభుత్వాల నిర్ణయాల్లో మార్పు రాకపోతే ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది బాలలు తనలా నిరసన తెలపాల్సి వస్తుందని పేర్కొంది. ఐక్యరాజ్య సమితి క్లైమేట్ ఛేంజ్ సమ్మిట్ లోనూ ప్రసంగించింది. ఇప్పటికైనా మార్పు రావాలని నాయకులకు సూచించింది.

*కాలిఫోర్నియా కార్చిచ్చు
అమెరికాలోని కాలిఫోర్నియాలో చెలరేగిన మంటల్లో 80 మందికిపైగా మృత్యువాత పడ్డారు. చాలా మంది గల్లంతయ్యారు. ఈ ఘటనకు ఫారెస్టు మిస్ మేనేజ్ మెంట్ కారణమని అధ్యక్షుడు ట్రంప్ ఆరోపించారు. అగ్నిమాపక శాఖ అధికారులు మాత్రం ఇది ప్రభుత్వ పనితీరుతోనే జరిగిందని తిప్పి కొట్టారు. ప్రభుత్వం సరైన చర్యలు తీసుకుంటే నష్టం కొంతైన తగ్గేదని పేర్కొన్నారు.

*వోక్స్ వ్యాగన్ ఎమిషన్ స్కాండల్
కాలిఫోర్నియాలోని మొజావే ఎడారిలో మరమ్మతుకు నోచుకోని లక్షలాది కార్ల ఫొటోను ఓ ఫొటో గ్రాఫర్ తన కెమెరాలో బంధించాడు. వోక్స్ వ్యాగన్ కంపెనీ నుంచి వెలువడుతున్న ఎమిషన్సే ఇందుకు కారణమని పేర్కొన్నారు. డీజిల్ కార్లు తక్కువ కాలుష్యాన్ని విడుదల చేస్తాయని చూపడానికి ఈ సంస్థ 2015లో ఓ సాఫ్ట్ వేర్ ను వినియోగించి విషవాయువు వెదజల్లిందని ఈ ఫొటో ఆరోపిస్తున్నాడు. ఆ ప్రాడ్ లో ఈ సంస్థ ఉన్నతాధికారి రాజీనామా చేసిన విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించాడు. ఇలాంటి ఫొటోలను ప్రచురించడంతో క్లైమేట్ ఛేంజ్ పై ప్రభుత్వాలకు కొంతవరకైనా అవగాహన కల్పించవచ్చు అంటున్నాడు.

ఇంకా నీటి కొరతతో దక్షిణాఫ్రికా దేశాలు సతమతవడం, దుబాయ్ లో ఖరీదైన లేది షూల ప్రదర్శన, పర్యావరణ పరిరక్షణపై బ్రిటన్ వంటి దేశాల్లో ప్రదర్శనలు, ఇండోనేషియా సముద్రజలాల్లో ప్లాస్టిక్ వస్తువులు మింగి భారీ తిమింగలం మరణం వంటి ఫొటోలు జాగ్రత్త పడక తప్పదని హెచ్చరిస్తున్నాయి.