Begin typing your search above and press return to search.

నాటు నాటు కాస్త.. 'నాటో..నాటో' గా మారిందే..!

By:  Tupaki Desk   |   12 Jan 2023 9:30 AM GMT
నాటు నాటు కాస్త.. నాటో..నాటో గా మారిందే..!
X
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్' మూవీ ఇండియన్ బాక్సాఫీసు వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. జూనియర్ ఎన్టీఆర్.. మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ మూవీ తెలుగు ఆడియన్స్ నే కాకుండా బాలీవుడ్.. కోలీవుడ్ అనే తేడా లేకుండా అందరినీ ఆకట్టుకుంది. ఇటీవల ఈ మూవీ జపాన్ లోనూ విడుదలై మంచి కలెక్షన్లు రాబట్టిన సంగతి అందరికీ తెలిసిందే.

ఈ క్రమంలోనే ప్రపంచవ్యాప్తంగా 'ఆర్ఆర్ఆర్' పేరు మార్మోగిపోయింది. ఈ సినిమా జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులను సైతం గెలుచుకుంది. తాజాగా ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డును గెలుచుకుంది. దీంతో అటు హాలీవుడ్ తోపాటు ఇండియాలోని అన్ని ఇండస్ట్రీలకు చెందిన ప్రముఖులు ఈ మూవీపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కించుకున్న తొలి ఇండియన్ సినిమా 'ఆర్ఆర్ఆర్' నిలిచింది. అలాగే బెస్ట్ ఏషియన్ పాటగా నాటు నాటు పాట నిలిచింది. కాగా ఈ నాటు నాటు పాటకి అవార్డు రావడంపై నెట్టింట్లో కొన్ని మీమ్స్ వైరల్ గా మారింది. వీటిలో కొన్ని మీమ్స్ బెస్ట్ గా నిలుస్తుండగా కొన్ని మీమ్స్ నవ్వులు పూయిస్తున్నాయి.

నాటు నాటు పాటను కాస్తా నాటో పదానికి దగ్గరగా ఉండటంతో ఓ క్రియేటర్ నాటు పదాన్ని కాస్త నాటోతో పోల్చాడు. దీంతో అది కాస్తా రష్యా అధ్యక్షుడు పుతిన్ కు అస్సలు నచ్చని 'నాటో నాటో'గా మారిపోయింది. దీనిని రష్యా అధ్యక్షుడు పుతిన్ కు ముడిపెడుతూ ఓ ఫన్నీ మీమ్స్ క్రియేట్ చేయడంతో అది కాస్తా నెట్టింట్లో వైరల్ గా మారింది.

నాటో నాటోకు పశ్చిమ దేశాలు బెస్ట్‌ సాంగ్‌ అవార్డు ఇచ్చాయని ఓ వ్యక్తి పుతిన్‌ చెవిలో చెబుతుంటాడు. ఈ మీమ్స్ కు నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగిసిన తర్వాత పుతిన్ నెక్ట్ టార్గెట్ 'ఆర్ఆర్ఆర్' కూడా అంటూ పలువురు సరదాగా మీమ్స్ చేస్తున్నారు.

ఇకపోతే గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కించుకున్న 'ఆర్ఆర్ఆర్' ఆస్కార్ పై కన్నేసింది. అకాడామీ అవార్డులో నాటు నాటు పాట లిస్ట్ అయింది. అయితే ఫైనల్ నామినేషన్లలో ఇది ఉంటుందా? లేదా అనే మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.