Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ పై జాతీయ మీడియా గురి..అంతా ప‌చ్చ స్కెచ్చేనా!

By:  Tupaki Desk   |   10 Feb 2020 7:30 PM IST
జ‌గ‌న్ పై జాతీయ మీడియా గురి..అంతా ప‌చ్చ స్కెచ్చేనా!
X
ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గురించి తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా ఏం చెప్పినా న‌మ్మే ప‌రిస్థితి లేకుండా పోయి చాలా కాలం అయిపోయింది. గ‌త పుష్క‌ర కాలంలో జ‌గ‌న్ గురించి తెలుగుదేశం అనుకూల మీడియా ఎంత ప్ర‌చారం చేసిందో అంద‌రికీ తెలిసిన సంగ‌తే. ఆ ప్ర‌చారం ప‌రాకాష్ట‌కు చేరింది. గ‌త ఏడాది సార్వ‌త్రిక ఎన్నిక‌ల ముందు ఆ ప్ర‌చారం మ‌రింత పీక్స్ కు వెళ్లి చివ‌ర‌కు తుత్తినియ‌లు అయిపోయింది. తెలుగుదేశం పార్టీని మ‌ళ్లీ గెలిపించాల‌ని జ‌గ‌న్ పై తీవ్ర స్థాయిలో జ‌రిగిన విష ప్ర‌చారాన్ని ప్ర‌జ‌లు కూడా లైట్ తీసుకున్నారు.

మీడియాను అడ్డు పెట్టుకుని ఏదో ఒక సారి గ‌ట్టెక్క‌వ‌చ్చు కానీ, ప్ర‌తి సారీ అది కుద‌ర‌ద‌ని స్ప‌ష్టం అయ్యింది. ఎన్నిక‌ల ఫ‌లితాల‌తో తెలుగుదేశం పార్టీకి కూడా అది క్లారిటీ వ‌చ్చిన‌ట్టు గా తెలుస్తోంది. ఈ నేప‌థ్యం లో ఇప్పుడు మ‌రో స్కెచ్ కు రంగం సిద్ధం అయిన‌ట్టు గా స‌మాచారం. ఇటీవ‌ల కియా కార్ల కంపెనీ ఏపీ నుంచి త‌ర‌లి వెళ్లిపోతోంద‌ని ఒక గాలి క‌థ ప్ర‌చారం జ‌రిగింది. దాన్ని ప్ర‌ముఖ వార్తా సంస్థ రాయిట‌ర్స్ కు ఆపాదించారు. రాయిట‌ర్స్ త‌న క‌థనం ద్వారా ఆ ప్ర‌చారం మొద‌లుపెట్టింది. అయితే ఏపీ ప్ర‌భుత్వం అల‌ర్ట్ అయ్యి, ఆ ప్ర‌చారాన్ని తిప్పి కొట్ట‌డం తో రాయిట‌ర్స్ కూడా దారికి వ‌చ్చింది. తాము రాసిన క‌థ‌నం త‌ప్పు అని ఆ మీడియా సంస్థ తేల్చింది. అందుకు సంబంధించి లింకు ను తొల‌గించింది.

ఆ వెంట‌నే రాయిట‌ర్స్ కు గ‌తంలో అధికారంలో ఉన్న‌ప్పుడు చంద్ర‌బాబు నాయుడు అయాచితంగా చేకూర్చిన ల‌బ్ధి వార్త‌ల్లోకి వ‌చ్చింది. అందుకు రుణాన్ని ఇప్పుడు ఆ సంస్థ తీర్చుకుంటుందనే అభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి. అలా ఒక బాణం దెబ్బ‌ తిన్నా జాతీయ మీడియా తీరు మాత్రం మార‌డం లేదు. మీడియా అమ్ముడు పోవ‌డం మొద‌లై చాలా కాలం అయ్యింది. అది జాతీయ మీడియా అయినా, అంత‌ర్జాతీయ మీడియా అయినా దానికో రేటు ఉంటుంది. ఆ రేటు ప్ర‌కార‌మే.. ఇప్పుడు జాతీయ మీడియా కూడా అమ్ముడు పోయింద‌నే అభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి.

ప‌ని కట్టుకుని జ‌గ‌న్ మీద‌, జ‌గ‌న్ ప్ర‌భుత్వం మీద వ్య‌తిరేక క‌థ‌నాల‌ను వండి వారుస్తూ ఉన్నాయి. మొన్న రాయిట‌ర్స్, ఇప్పుడు ఎక‌నామిక్ టైమ్స్. ఈ సారి అడ్డ‌గోలుగా జ‌గ‌న్ మీద వ్య‌తిరేక క‌థ‌నాన్ని రాసింది ఎక‌నామిక్ టైమ్స్. ప్ర‌భుత్వ నిర్ణ‌యాల‌ను త‌ప్పు ప‌డుతూ జ‌గ‌న్ ను ఒక జ‌గ‌మొండిగా అభివ‌ర్ణించింది. తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టే నిర్ణ‌యాల‌ను ఎక‌నామిక్ టైమ్స్ త‌ప్పు ప‌ట్టింది.

మొన్న రాయిట‌ర్స్ త‌ర‌హాలో ఇది మ‌రో గాలి క‌థ‌నం. రాయిట‌ర్స్ కియా విష‌యంలో టార్గెట్ చేస్తే, ఎక‌నామిక్ టైమ్స్ గాలిగా ఏదో ఒక క‌థ‌నం రాసింది. అయితే ఇదంతా ఒక వ్యూహాత్మ‌కంగా జ‌రుగుతోంద‌నే అభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి.