Begin typing your search above and press return to search.
కబడ్డీ క్రీడాకారిణిని రేప్ చేశాడు
By: Tupaki Desk | 18 July 2017 12:44 PM ISTసినీ రంగంలో అవకాశాల పేరుతో అమ్మాయిల్ని ఎలా లోబరుచుకుంటారో.. ఇక్కడ ఎలాంటి అఘాయిత్యాలు జరుగుతుంటాయో జనాలు చర్చించుకుంటూ ఉంటారు. కానీ క్రీడా రంగంలో జరిగే అకృత్యాల గురించి పెద్దగా చర్చ ఉండదు. వీటి మీద అంతగా ఫోకస్ ఉండదు. అవకాశాల పేరుతో అక్కడ కూడా సీనియర్ క్రీడాకారులు.. కోచ్ లు.. అధికారులు అమ్మాయిలపై అఘాయిత్యాలకు పాల్పడుతుంటారు. అవి చాలా వరకు మరుగున పడిపోతుంటాయి. కొందరు మాత్రమే బయటికి వచ్చి తమకు జరిగిన అన్యాయం గురించి చెబుతుంటారు. తాజాగా ఒక జాతీయ స్థాయి కబడ్డీ క్రీడాకారిణి తనపై అత్యాచారం చేసిన క్రీడాకారుడి గురించి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఢిల్లీకి చెందిన 16 ఏళ్ల జాతీయ స్థాయి కబడ్డీ క్రీడాకారిణి తనపై అత్యాచారం జరిగిందంటూ పోలీసులను ఆశ్రయించింది. ఈ నెల 9న ఓ సీనియర్ అథ్లెట్ తనపై అఘాయిత్యానికి ఒడిగట్టాడని ఆమె ఫిర్యాదు చేసింది. తాను స్పృహలో లేనిసమయంలో ఈ అఘాయిత్యం జరిగిందని.. ఆ సమయంలో తనకు ఏం జరిగిందో కూడా తెలియదని.. తాను ఓ పెద్ద గదిలో ఉన్నట్లు మాత్రమే తనకు గుర్తుందని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టిన క్రీడాకారుడి వయసు 35-40 ఏళ్ల మధ్య ఉంటుందని.. అతను ఆమెను కారులో ఛత్రసల్ మైదానం నుంచి తీసుకెళ్లాడని.. ఆహారంలో మత్తు మందు కలిపి ఇచ్చాడని.. స్పృహ కోల్పోయాక అత్యాచారానికి ఒడిగట్టాడని.. ఆమెను బెదిరించి బస్టాండు దగ్గర వదిలేశాడని పోలీసులు తెలిపారు. ముందు దీని గురించి బయటికి చెప్పడానికి భయపడినా.. తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసిందట బాధితురాలు. కేసు నమోదు చేసిన పోలీసులు బాధితురాలిని వైద్యపరీక్షల కోసం ఆసుపత్రికి పంపారు.