Begin typing your search above and press return to search.
ఏపీ పోలీసులకు జాతీయ స్థాయిలో పురస్కారాల వర్షం !
By: Tupaki Desk | 3 Sept 2021 7:00 PM ISTఆంధ్రప్రదేశ్ పోలీసులకు మరోసారి జాతీయస్థాయిలో గుర్తింపు లభించింది. రాష్ట్ర పోలీసులకు జాతీయస్థాయిలో 5 అవార్డులు లభించాయని డీజీపీ గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. దాంతో ఏపీ పోలీసులకు ఈ రెండేళ్ల కాలంలో లభించిన అవార్డుల సంఖ్య 130కి దాటిందని వెల్లడించారు. తాజాగా లభించిన ఐదు అవార్డులు టెక్నాలజీ వినియోగం అంశంలో వచ్చాయని వివరించారు.
ఈ రోజు ఏపీ పోలీసులు గర్వించదగ్గ రోజని పేర్కొన్నారు. డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ ద్వారా ఏపీ పోలీసు శాఖలోని సిబ్బంది ఆరోగ్య సమాచారమంతా పొందుపరచామని, దీనికి కూడా అవార్డు దక్కిందన్నారు. కృత్రిమ మేధ, పాస్ పోర్ట్ వెరిఫికేషన్, పోలీసు సిబ్బంది డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ నిర్వహణ తదితర అంశాల్లో ఏపీ పోలీసు విధానాలు దేశంలోనే అగ్రగామిగా నిలిచాయని పేర్కొన్నారు. ముఖ్యంగా, కరోనా సంక్షోభ సమయంలో రాష్ట్ర పోలీసుల పనితీరు సర్వత్రా ప్రశంసలు అందుకుందని అన్నారు. తాజా పురస్కారాలతో రాష్ట్ర పోలీసులపై మరింత బాధ్యత పెరిగిందని డీజీపీ తెలిపారు.
గడిచిన రెండేళ్లలో ఇప్పటి వరకు 130 అవార్డులు ఏపీ పోలీస్ శాఖకి దక్కాయయని, ఈ అవార్డులు పోలీస్ శాఖపై మరింత బాద్యత పెంచాయని పేర్కొన్నారు. అవార్డులు పెరుగుతున్న కొద్దీ శాఖ పనితీరుని మరింతగా మెరుగుపరుచుకుంటున్నామన్నారు. కరోనా సమయంలోఘేపీ పోలీస్ పనితీరు ప్రశంసలు అందుకుందని చెప్పారు. దిశ యాప్, మహిళల రక్షణపై ఏపీ పోలీసు శాఖకి ఇప్పటివరకు 17 అవార్డులు వచ్చాయి. మహిళల రక్షణ కోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుందది. సీఎం వైఎస్ జగన్ దిశ యాప్ ప్రారంభించిన తర్వాత నుంచి రాష్ట్రంలో 46,66,841 మంది ఇప్పటి వరకు ఈ యాప్ డౌన్ లోడ్ చేశారు.
దిశ యాప్ తో మహిళలకి దైర్యం వచ్చింది. దిశ యాప్‌తో అన్ని విధాల రక్షణ లబిస్తుందని మహిళలు భావిస్తున్నారు. రోజుకి 4 వేల వరకు కాల్స్ వస్తున్నాయి. దిశ యాప్ ఒక్కదానికే గతంలో మూడు జాతీయ అవార్డులు వచ్చాయి.పోలీస్ సేవా యాప్‌ను ఇప్పటి వరకు 7 లక్షల పైన డౌన్‌లోడ్ చేసుకున్నారు. పోలీస్ సేవా యాప్ ద్వారా ప్రజలకి ఎన్నో సేవలు అందిస్తున్నాం. పోలీస్ శాఖలో పారదర్శకతకి ఈ పోలీస్ సేవా యాప్ ద్వారా పెద్ద పీట వేస్తున్నాం. ప్రతీ సోమవారం అన్నిజిల్లాల ఎస్పీ కార్యాలయాలలో స్పందన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం అని తెలిపారు. టెక్నాలజీ వినియోగంలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టి ప్రజలకు పారదర్శకంగా, జవాబుదారితనంతో, త్వరతగతిన సేవలందించే దిశగా అడుగులు వేస్తున్నామ, జాతీయ స్థాయిలో అవార్డులను దక్కించుకున్న విజేతలందరిని అభినందించారు.