Begin typing your search above and press return to search.

విశాఖ గ్యాస్ లీక్: ఎన్.జీ.టీ సంచలన తీర్పు

By:  Tupaki Desk   |   4 Jun 2020 6:15 AM GMT
విశాఖ గ్యాస్ లీక్: ఎన్.జీ.టీ సంచలన తీర్పు
X
విశాఖలో గ్యాస్ లీక్ అయ్యి 12 మంది మృతికి కారణమైన ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమకు గట్టి షాక్ తగలింది. సంస్థ డిపాజిట్ చేసిన రూ.50 కోట్లను పర్యావరణ పునరుద్ధరణ.. పరిహారానికి వాడాలని జాతీయ హరిత ట్రైబ్యునల్(ఎన్.జీ.టీ) ఆదేశించింది. ఈ మేరకు విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై సంచలన తీర్పునిచ్చింది.

కేంద్ర పర్యావరణ శాఖ, పీసీబీ నుంచి ఒక్కొక్కరు, విశాఖ కలెక్టర్ తో కమిటీ ఏర్పాటు చేయాలని.. రెండు నెలల్లోగా కమిటీ పునరుద్ధరణ ప్రణాళిక ఇవ్వాలని ఎన్.జీ.టీ ఆదేశాలు జారీ చేసింది. ఈ కమిటీకి కేంద్ర పర్యావరణ శాఖ నోడల్ ఏజెన్సీగా వ్యవహరించాలని ఎన్.జీ.టీ సూచించింది. బాధితులకు ఎంత పరిహారం ఇవ్వాలన్నది నిర్ణయించేందుకు మరో కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించింది.

రెండు వారాల్లో కమిటీని ఏర్పాటు చేసి రెండు నెలల్లోగా నివేదిక సమర్పించాలని కేంద్ర పర్యావరణ శాఖ కార్యదర్శిని ఆదేశించింది. లాక్ డౌన్ తర్వాత అనుమతి లేకుండా పునరుద్ధరణ పనులు చేపట్టేందుకు బాధ్యులైన వారిని గుర్తించి చర్యలుత తీసుకోవాలని ఎన్జీటీ సూచించింది. దీనిపై రెండు నెలల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.

ఇక ఎన్.జీ.టీ ఇంత విపత్తుకు కారణమైన ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమకు గట్టి షాక్ ఇచ్చింది. చట్టబద్ధ అనుమతి వచ్చాక ప్రారంభించేందుకు మేమే అనుమతి ఇస్తామని తెలిపింది. పర్యావరణ నిబంధనల తనిఖీలు చేసి 3 నెలల్లో నివేదిక ఇవ్వాలని పేర్కొంది. సుమోటోగా కేసు స్వీకరించే అధికారం ఎన్టీజీకి ఉందని తెలిపింది.