Begin typing your search above and press return to search.

ఏపీ ఎత్తిపోత‌ల‌కు ప‌ర్యావ‌ర‌ణ బ్రేక్‌..ఏం జ‌రిగిందంటే!

By:  Tupaki Desk   |   13 Aug 2019 2:06 PM GMT
ఏపీ ఎత్తిపోత‌ల‌కు ప‌ర్యావ‌ర‌ణ బ్రేక్‌..ఏం జ‌రిగిందంటే!
X
రాష్ట్ర సాగునీటి ప‌ధ‌కాలు నిలిచిపోనున్నాయా? ఇప్ప‌టి వ‌ర‌కు చుక్క నీరు లేక ఇబ్బందులు ప‌డిన ప్ర‌జ ల‌కు, రైతుల‌కు ఇప్పుడు కురుస్తున్న వ‌ర్షాలు కొంత ఉప‌శ‌మ‌నం క‌ల్పిస్తున్నా.. కేంద్రం లోని గ్రీన్ ట్రైబ్యున‌ల్ ఆదేశాల‌తో ఆయా ప్రాజెక్టులు నిలిచిపోతాయా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. తాజాగా రాష్ట్ర ప్ర‌భుత్వానికి జాతీయ గ్రీన్ ట్రిబ్యూనల్ నోటీసులు పంపింది. రాష్ట్రంలోని పర్యావరణ అనుమతుల్లే ని ఎత్తిపోతల పథకాలను ఆపాలని ఎన్జీటీ ఆదేశించింది. గోదావరి-పెన్నా - పురుషోత్తపట్నం - పట్టిసీమ - చింతలపూడి ప్రాజెక్టులను నిలిపివేయాలని కోరింది.

అయితే, పర్యావరణ అనుమతలు తీసుకున్నాకే ఆయా పథకాలను నడపాలని ఆదేశించ‌డం గ‌మ‌నార్హం.. గోదావరి - పెన్నా నదులపై ఎక్కువగా ఎత్తిపోతల పథకాలు చేపడుతున్నారని, దీనివల్ల పర్యావరణం దెబ్బతింటోందని మాజీ మంత్రి వట్టి వసంతకుమార్ స‌హా మరొకరు ఎన్జీటీలో గ‌తంలోనే పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ పై గతంలోనే విచారణ చేపట్టిన ఎన్జీటీ.. అనుమతులు లేకుండా ప్రాజెక్టులు కడుతుం టే మీరేం చేస్తున్నారంటూ కేంద్ర - రాష్ట్ర కాలుష్య మండల్లపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

దానిపై ఆయా బోర్డులతో ఓ సంయక్త కమిటీని నియమించి నష్టాన్ని అంచనావేసి నివేదిక ఇవ్వాల్సిందిగా నాలుగు వారాల సమయమిచ్చింది. తాజాగా ఆ కమిటీ నివేదిక అందజేసింది. దీనిపై విచారణ చేపట్టిన జాతీయ గ్రీన్ ట్రిబ్యూనల్ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. పర్యావరణ అనుమతులు పొందిన తర్వాతనే ఆయా ప్రాజెక్టులను తిరిగి కొనసాగించాలని స్పష్టం చేసింది. దీనితో రాష్ట్రప్రభుత్వం ఇరకాటంలో పడినట్టు ఉంది. గత ప్రభుత్వం హయాంలో మొదలు పెట్టిన ఈ ప్రాజెక్టులు చాలా ఉపయోగంగా ఉన్నాయి.

మరీ ముఖ్యంగా పట్టిసీమ - పురుషోత్తపట్నం ప్రాజెక్టులు…. ఇప్పుడు వీటికి బ్రేక్ పడటం ప్రభుత్వానికి ఇబ్బందే. మరోపక్క ఈ తీర్పుపై జాతీయ గ్రీన్ ట్రిబ్యూనల్ లో అప్పీల్ చెయ్యడానికి ప్రభుత్వం సిద్ధం అవుతుంది. ఈ నేప‌థ్యంలో రాష్ట్రంలోని ప్రాజెక్టుల విష‌యం చ‌ర్చ‌కు వ‌స్తోంది.