Begin typing your search above and press return to search.

అమరావతి అనుమతుల కేసు 22కి వాయిదా..

By:  Tupaki Desk   |   4 April 2016 9:56 AM GMT
అమరావతి అనుమతుల కేసు 22కి వాయిదా..
X
ఏపీ రాజధాని అమరావతి పర్యావరణ అనుమతులపై ఎన్జీటీలో వాదనలు పూర్తయ్యాయి. తదుపరి విచారణకు జాతీయ హరిత ట్రైబ్యునల్‌ ఈనెల 22కు వాయిదా వేసింది. వరద ప్రభావిత ప్రాంతాలను తొలగించలేదని పిటిషనర్‌ తరపున న్యాయవాది వాదనలు వినిపించారు. రాజధాని బృహత్‌ ప్రణాళిక నుంచి వరద ప్రభావిత ప్రాంతాలను తొలగించాలని,వరద ప్రభావిత ప్రాంతాల గుర్తింపునకు నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని వాదించారు. ఇప్పటికే వరద ప్రభావిత ప్రాంతాలను గుర్తించామని ఏపీ ప్రభుత్వం పేర్కొంది.

కాగా కృష్ణానదితో పాటు కొండవీటి వాగుకు వరదలు వస్తే, ముంపునకు గురయ్యే ప్రాంతాల్లో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నారని జాతీయ గ్రీన్ ట్రైబ్యునల్ లో నిబంధనలకు విరుద్ధంగా నవ్యాంధ్ర రాజధానిని నిర్మిస్తున్నారని ఆరోపిస్తున్న పిటిషనర్లు తమ వాదనలను వినిపించారు. అసలు వరదకు గురయ్యే ప్రాంతాలను గుర్తించేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాల్సి వుందని, ఇవేమీ చేయకుండానే అమరావతిని నిర్మిస్తున్నారని తెలిపారు. తాము ఇప్పటికే వరద ప్రభావిత ప్రాంతాన్ని గుర్తించామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ ట్రైబ్యునల్ ముందు వాదించగా, కేసు తదుపరి విచారణను ఈ నెల 22కు వాయిదా వేస్తున్నట్టు న్యాయమూర్తి ప్రకటించారు.