Begin typing your search above and press return to search.

ప్రధాని ప్రోగ్రాంలో జాతీయ గీతాన్నిస్కిప్ చేశారు

By:  Tupaki Desk   |   4 Jan 2017 4:53 AM GMT
ప్రధాని ప్రోగ్రాంలో జాతీయ గీతాన్నిస్కిప్ చేశారు
X
జాతీయ గీతానికి అవమానం జరిగిందా? అంటే.. అవుననే మాటను పలువురు చెబుతున్నారు. తిరుపతి నగరంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన జాతీయ సైన్స్ సదస్సులో జాతీయ గీతం ప్రస్తావన లేకుండా కార్యక్రమాన్ని మొదలుపెట్టటం..ముగించటాన్ని పలువురు తీవ్రంగా తప్పు పడుతున్నారు. ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం.. సినిమా థియేటర్లలో తప్పనిసరిగా జాతీయ గీతాన్ని ఆలపించేలా తీర్పును ఇచ్చారు.

అంతర్జాతీయ.. జాతీయ స్థాయిలో ప్రముఖులు.. ప్రధాని మోడీ స్వయంగా పాల్గొన్న అధికారిక కార్యక్రమంలో జాతీయ గీతం ఊసే లేకపోవటం గమనార్హం. జాతీయ సైన్స్ కాంగ్రెస్ సదస్సులో జాతీయ గీతాన్ని ఆలపించాలన్న విషయాన్ని నిర్వాహకులు మర్చిపోవటం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇస్కా వ్యవహారాల్ని పర్యవేక్షిస్తున్న అధికారుల్లో కోఆర్డినేషన్ మిస్ కావటం వల్లే ఇలాంటి పరిస్థితి చోటుచేసుకుందని చెబుతున్నారు.

కార్యక్రమానికి భారీ ఏర్పాట్లు చేశాం.. ప్రోగ్రాంకు వచ్చే అతిధులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా హోటళ్లు బుక్ చేశాం.. పసందైన వంటకాలు రెఢీ చేయించాం..అదిరిపోయేలా ట్రాన్స్ పోర్ట్ ఏర్పాట్లు చేశామని చెప్పే వారు.. అన్నింటికి మించి..జాతీయ గీతాన్ని పాడాలన్న కనీస విషయాన్ని మర్చిపోవటం చూసినప్పుడు సగటు భారతీయుడి మనసు బాధకు గురి కావటం ఖాయం. ఎంత హడావుడి అయితే మాత్రం జాతీయగీతాన్ని మరిచిపోయే పొరపాటు చేస్తారా?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/