Begin typing your search above and press return to search.

అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్న త‌మిళ టీచ‌ర్ ప్ర‌యోగం

By:  Tupaki Desk   |   27 Jun 2019 2:54 PM IST
అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్న త‌మిళ టీచ‌ర్ ప్ర‌యోగం
X
దేశంలో ఎన్నో భాష‌లు ఉన్నా.. జ‌న‌గ‌ణ‌మ‌ణ వ‌చ్చేస‌రికి అంద‌రూ ఒకే తీరులో పాడుతుంటారు. దీనికి భిన్నంగా త‌మిళ‌నాడులోని ఒక ప్ర‌భుత్వ పాఠ‌శాల టీచ‌ర్ చేసిన ప్ర‌య‌త్నం ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షించ‌ట‌మే కాదు.. సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. జ‌న‌గ‌ణ‌మ‌ణ‌ను త‌మిళంలో మార్చి పాడిన ఒక టీచ‌ర్ త‌యారు చేసిన వీడియో అంద‌రి దృష్టిని విప‌రీతంగా ఆక‌ర్షిస్తోంది.

త‌మిళ‌నాడులోని తిరుప్పూరు జిల్లా సేవూర్ లోని ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో ప‌ని చేస్తున్న స్కూల్ టీచ‌ర్ ఇవాంజ‌లిన్ ప్రిస్కిల్లా. ఆమె ఇంగ్లిషు టీచ‌రుగా 18 ఏళ్లుగా ప‌ని చేస్తున్నారు. ఇంగ్లిషు నేర్చుకోవ‌టానికి పిల్ల‌లు ప‌డే ఇబ్బంది నేప‌థ్యంలో.. ఇంగ్లిషులో ఉన్న వాటిని ప్రాంతీయ భాష‌లోకి అనువ‌దించ‌టం ఆమెకు ఒక అల‌వాటు.

అదే స‌మ‌యంలో జ‌న‌గ‌ణ‌మ‌ణ‌ను త‌మిళంలో మారిస్తే ఎలా ఉంటుంద‌న్న ఆలోచ‌న‌తో ఆమె స‌రికొత్త‌ ప్ర‌య‌త్నం చేశారు. జాతీయ గీతాన్ని త‌మిళంలో పాడి వీడియోను విడుద‌ల చేశారు. ఇప్ప‌టివ‌ర‌కూ అల‌వాటైన జ‌న‌గ‌ణ‌మ‌ణ ట్యూన్ లోనే ఉన్న త‌మిళ జ‌న‌గ‌ణ‌మ‌ణ అదే భావోద్వేగాన్ని క‌లిగించేలా ఉండ‌టం విశేషం. అయితే.. ఒరిజ‌న‌ల్ జ‌న‌గ‌ణ‌మ‌ణ అర్థం అచ్చుగుద్దిన‌ట్లు రాకున్నా.. స్ఫూర్తి మాత్రం మిస్ కాకుండా ఉండేలా ఆమె త‌యారు చేశారు.

ఎప్ప‌టిలానే ఈ ప్ర‌యోగానికి మిశ్ర‌మ స్పంద‌న ల‌భించింది. కొంద‌రు బాగుంద‌న్న మాట చెబితే.. మ‌రికొంద‌రు బాగోలేద‌న్న మాట‌ను చెబుతున్నారు. అయితే.. త‌మిళాన్ని అమితంగా అభిమానించి.. ఆరాధించే వారంతా త‌మిళ జాతీయ గీతాన్ని ఆద‌రిస్తున్నారు. ఇలా ఎవ‌రికి వారు త‌మ త‌మ భాష‌ల్లోకి అనువ‌దిస్తే.. జాతీయ గీతం స్ఫూర్తి మిస్ అవుతుంద‌న్న మాట‌లో కొంత నిజం ఉన్నా.. అనువాదం చేయ‌టం వెనుక ఎలాంటి త‌ప్పుడు ఆలోచ‌న‌లు లేని నేప‌థ్యంలో అంత సీరియ‌స్ గా తీసుకోవాల్సిన అవ‌స‌రం లేద‌న్న మాట వినిపిస్తోంది. ఏమైనా.. ఒక కొత్త ప్ర‌యోగాన్ని ప్ర‌యోగంగా చూస్తే స‌రిపోతుంది.