Begin typing your search above and press return to search.

మార్చి 21న భూమికి దగ్గరగా భారీ గ్రహశకలం నాసా హెచ్చరికలు

By:  Tupaki Desk   |   17 March 2021 2:10 PM GMT
మార్చి 21న భూమికి దగ్గరగా భారీ గ్రహశకలం నాసా హెచ్చరికలు
X
ఈ నెల 21న భూమికి 1.25 మిలియన్ల మైళ్ల కిలోమీటర్ల దూరంలోకి భారీ ఉల్క రానుందని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా తెలిపింది. సుమారు మూడువేల అడుగులున్న అంతరిక్ష గ్రహశకలాన్ని 20 ఏళ్ల కిందట గుర్తించగా.. దానికి ‘2001 ఎఫ్‌ఓ32’గా నామకరణం చేశారు. ఉల్క కక్ష్య మార్గం ఖచ్చితత్వంతో తెలుసని, భూమికి 1.25 మిలియన్‌ మైళ్ల కంటే భూమికి దగ్గరగా రాదని సెంటర్ ఫర్ నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్ స్టడీస్ డైరెక్టర్ పాల్ చోడాస్ తెలిపారు. దీంతో అది భూమికి 2 మిలియన్‌ కిలోమీటర్ల కంటే దగ్గరగా వచ్చే అవకాశం లేదని శాస్త్ర‌వేత్త‌లు చెప్పారు. అయినప్పటికీ దీన్ని ప్రమాదకరమైన గ్రహశకలంగానే భావించాలని వారు అంటున్నారు.

గ్రహశకలం గంటకు 77వేల మైళ్ల వేగంతో ప్రయాణిస్తుందని నాసా పేర్కొంది. ప్రస్తుతం ఈ అంతరిక్ష గ్రహశకలం గురించి ఎక్కువగా సమాచారం లేదని, భూమికి దగ్గరగా వస్తుండడంతో దాని గురించి మరింత తెలుసుకొని.. భవిష్యత్‌లో దాన్ని ఎదుర్కొనేందుకు అద్భుతమైన అకాశమని నాసా జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీ ప్రధాన శాస్త్రవేత్త లాన్స్ బెన్నర్ అన్నారు. ఆస్టరాయిడ్‌ పరిమాణం, ఉపరితలంపై కాంతి పరావర్తనంపై అధ్యయనం చేయడం ద్వారా దాని కూర్పును పరిశీలింవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

సుమారు వందేళ్ల క్రితం.. అంటే 1908, జూన్‌ 30న ఓ గ్రహశకలం సైబీరియాలోని తుంగుస్కా ప్రాంతంలో భూమిని తాకింది. ఇటీవలి ప్రపంచ చరిత్రలో భూమిపై పడ్డ ఆస్టరాయిడ్‌ ఇదేనని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. తుంగుస్కా ప్రాంతంలో ఆస్టరాయిడ్‌ దెబ్బకు భారీ ఎత్తున అడవి ధ్వంసమైంది. ఆ దెబ్బకు 830 చదరపు మైళ్లలోని 8 కోట్ల చెట్లు సర్వనాశనమయ్యాయి. అయితే ఇది ఇనప ఖనిజంతో కూడిన ఆస్టరాయిడ్‌ అని రష్యా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమిని ఢీకొట్టిన తర్వాత అది మళ్లీ అంతరిక్షంలోకి వెళ్లిపోయిందని వారు చెబుతున్నారు. అయితే దీనికి భిన్నంగా మరికొంత మంది శాస్త్రవేత్తలు వాదిస్తున్నారు.