Begin typing your search above and press return to search.

గ్రహ శకలాన్ని ముద్దాడిన నాసా వ్యోమనౌక

By:  Tupaki Desk   |   21 Oct 2020 7:40 PM IST
గ్రహ శకలాన్ని ముద్దాడిన నాసా వ్యోమనౌక
X
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా పదేళ్ల నిరీక్షణ ఫలించింది. నాసా పంపిన ‘ఒసైరిన్ --రెక్స్’ అనే వ్యోమనౌక ఏకంగా ‘బెన్ను’ అనే గ్రహశకలంపై విజయవంతంగా దిగింది. అన్ని అనుకున్నట్లుగా జరిగినట్లు ఈ ప్రాజెక్ట్ కు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త లారేటా తెలిపారు. గ్రహశకలంపై దిగగానే ‘ఒసైరిస్ ’ నాసా కేంద్రానికి సంకేతాలు పంపినట్లు వెల్లడించింది.

గ్రహశకలంపై చిన్న రేణువులతోపాటు భారీ శిలలు ఉన్నాయి. పైగా అక్కడ గురుత్వాకర్షణ చాలా తక్కువ. ఈ నేపథ్యంలోనే ల్యాండింగ్ ప్రక్రియపై ఇప్పటివరకు సర్వత్రా ఉత్కంఠనెలకొంది. ఏవైనా అనూహ్య పరిణామాలు ఎదురైతే తిరిగి గాల్లోకి ఎగిరేలా ఏర్పాట్లు చేశారు.

ప్రస్తుతం బెన్ను గ్రహశకలాన్ని వ్యౌమనౌక తాకింది. ఆ గ్రహశకలం ఉపరితలంపై అది 5-10 సెకన్లు మాత్రమే ఉంటుంది. వ్యౌమనౌక కిందకు దిగకుండా కేవలం చేతిలాంటి ఒక పరికరం మాత్రమే గ్రహశకలాన్ని తాకుతుంది. గ్రహశకలం నుంచి దాదాపు 60 గ్రాముల నమూనాలను సేకరిస్తుంది.

బెన్నును చేరడానికి నాసా దాదాపు దశాబ్ధ కాలంగా (10 ఏళ్లుగా) కృషి చేస్తోంది. నేడు వారి కృషి ఫలించడంతో ఈ ప్రాజెక్టులో భాగమైన శాస్త్రవేత్తలు, టెక్నీషియన్లు అంతా ఆనందం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు జపాన్ మాత్రం ఈ ఘనతను సాధించింది. ఇప్పుడు అమెరికా ఆ సరసన చేరింది.

ఈ వ్యోమనౌకను 2016లో నాసా ప్రయోగించింది. బెన్నుపై ఇసుక ఉటుందని భావించింది. అయితే రాళ్లు రప్పలు ఉన్నాయి. 2 సెంటీ మీటర్లకంటే చిన్నపాటి రాళ్లను మాత్రమే ఒసైరిన్ రెక్స్ సేకరిస్తుంది.