Begin typing your search above and press return to search.

ఇండియా, చైనాపై నాసా సంచలన రిపోర్ట్

By:  Tupaki Desk   |   28 Jun 2019 4:22 PM IST
ఇండియా, చైనాపై నాసా సంచలన రిపోర్ట్
X
20 ఏళ్ల క్రితం భారత్- చైనా ఎలా ఉన్నాయి.. ఇప్పుడు 20 ఏళ్ల తర్వాత ఎలా ఉన్నాయి.? దీనిపై అమెరికా అంతరిక్ష సంస్థ నాసా సంచలన విషయాలను తన అధ్యయనంలో వెల్లడించింది. ప్రపంచంలో ప్రస్తుతం పచ్చదనం పరుచుకోవడానికి మూడింట ఒక వంత భారత్- చైనాలే హరిత హారమే కారణమని కొనియాడింది. గత 20 ఏళ్లతో పోలిస్తే పచ్చదనం ఈ రెండు దేశాల్లో పెరిగిందని నాసా తాజాగా విడుదల చేసిన శాటిలైట్ చిత్రాల ద్వారా తెలిపింది.

బోస్టన్ విశ్వవిద్యాలయానికి చెందిన చి-చెన్ ఈ అధ్యయన వివరాలను ‘నేచర్ సస్టెయినబిలీటీ’ అనే జర్నల్ ద్వారా వెల్లడించారు. ఇందుకోసం నాసా సాయం తీసుకున్నారు. 1990 నాటి ఉపగ్రహ ఫొటోలు-2017 తాజాగా ఉపగ్రహాలను ఫొటోలను సేకరించి ప్రపంచంలో పచ్చదనంపై చిత్రాలను పోల్చి చూశాక.. ఈ అధ్యయనంలో పంట భూముల విస్తీర్ణం ఈ రెండు దేశాల్లో పెరిగినట్లు స్పష్టమవుతోంది.

ఈ అధ్యయనంలో చైనా- భారత్ ల పచ్చదనంపై నివేదికలు పొందుపరిచారు. చైనాలో పచ్చదనానికి అడవులు 42శాతం, పంట భూములు 32శాతం కారణమని తెలిపారు. అదే ఇండియాలో మాత్రం అడవులు 4.4శాతం.. పంట భూములు 82శాతం కారణమని తేల్చారు.

ప్రధానంగా భారత్ లో అడవులను కొట్టిన వారు పంటలు వేస్తూ పచ్చదనానికి పర్యావరణానికి పాటుపడుతున్నారని.. 2000 నాటితో పోలిస్తే ఈ రెండు దేశాల్లో ఆహార ఉత్పత్తి పెరగడానికి పంటలే కారణమన్నారు.

1970-80లలో ఇండియా, చైనాల్లో పెద్ద ఎత్తున అడవుల నరికివేత జరిగిందని.. కానీ నేడు అది గుర్తించి మొక్కలు పెంచడం.. పంటలు పండించడం వల్ల పచ్చదనం అలుముకుందని నాసా చిత్రాల ద్వారా ఈ అధ్యయనంలో వివరించారు.