Begin typing your search above and press return to search.

షాకింగ్: అంగార‌కుడిపై ఏలియ‌న్ల జాడ‌?

By:  Tupaki Desk   |   1 May 2018 8:46 AM GMT
షాకింగ్: అంగార‌కుడిపై ఏలియ‌న్ల జాడ‌?
X
ప్ర‌పంచ‌లోని కొన్ని ప్రాంతాల‌లో ఏలియ‌న్స్(గ్ర‌హాంత‌ర‌వాసులు) జాడ‌లున్నాయ‌ని....వారు భూమిపై సంచ‌రించార‌ని చాలా కాలంగా అనేక వాద‌న‌లున్న సంగ‌తి తెలిసింది. అంతేకాదు, అమెరికాలోని మిలిట‌రీ బేస్ `ఏరియా 51` ప్రాంతంలో చాలా కాలంగా ఏలియ‌న్ల‌పై ప‌రిశోధ‌న‌లు కూడా చేస్తున్నార‌ని .....వేరే గ్ర‌హాల్లో నివ‌సించే ఏలియ‌న్లు అప్పుడ‌ప్పుడు భూమిపైకి షికారుకు వ‌చ్చి వెళుతుంటాయ‌ని పుకార్లు వస్తుంటాయి. ద‌శాబ్దాల నుంచి ప్ర‌చారంలో ఉన్న ఈ పుకార్లకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆధారాలు, సాక్ష్యాలు లేవు. అయితే, ఆ పుకార్ల‌కు ఊత‌మిచ్చేలా అడ‌పా ద‌డ‌పా నాసా వాళ్లు అపుడుపుడు షాకింగ్ ఫొటోలు - క‌థ‌నాలు విడుద‌ల చేస్తుంటారు. కొద్ది రోజుల క్రితం వీనస్‌(శుక్ర‌గ్ర‌హం) గ్ర‌హం ఏలియ‌న్స్ జాడ‌ను గుర్తించిన‌ట్లు నాసా సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన సంగ‌తి తెలిసిందే. తాజాగా, అంగారుకుడి(మార్స్‌)పై ఏలియ‌న్ జాడ‌లున్నాయ‌ని తెలిపే ఫొటో ఒక‌టి సంచ‌ల‌నం రేపుతోంది. అంగారకుడిపై నాసా మార్స్‌ రోవర్ తీసిన ఆ ఫొటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది.

అంగారకుడిపై నాసా మార్స్ రోవ‌ర్ రెగ్యుల‌ర్ గా తీసిన ఫొటోలలో ఒక‌టి ఇపుడు వైర‌ల్ అయింది. ఆ ఫొటో చూసిన `ఆర్ట్ ఏలియ‌న్ టీవీ-మార్స్ జూ` అనే యూట్యూబ్ చానెల్ అడ్మిన్ జో వైట్....ఆ ఫొటోలో ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాన్ని గుర్తించాడు. ఆ ఫొటోలోని రాళ్ల‌లో ....ఈజిప్టులోని మహిళా యోధురాలి విగ్రహం తల ఆకారంలో కనిపిస్తున్న ఓ రాయిని జో గుర్తించాడు. అంతేకాదు, దాంతోపాటు ప్ర‌స్తుతం మాన‌వులు ధ‌రిస్తున్న బూటు ఆకారంలో ఉన్న మ‌రో రాయిని, పెద్ద పుర్రె ఆకారంలో ఉన్న మ‌రో రాయిని కూడా జో గుర్తించాడు. ఇదే విష‌యాన్ని వివ‌రిస్తూ త‌న యూట్యూబ్ చానెల్లో ఓ వీడియోను పోస్ట్ చేశాడు. దీంతో, ఆ వీడియో వైర‌ల్ అయింది. గ‌తంలో కూడా ఈజిప్టు లోని గిజా పిర‌మిడ్ల‌తో ఏలియ‌న్ల‌కు సంబంధం ఉంద‌ని క‌థ‌నాలు వెలువ‌డిన సంగ‌తి తెలిసిందే. తాజా ఫొటోలో అంగార‌కుడికి , భూమికి లింక్ ఉంద‌ని పుకార్లు వ‌స్తున్నాయి. గ‌తంలో కూడా మార్స్ పై జీవం ఉంద‌ని, భూమిపై మాన‌వాళికి కూడా మార్స్ కు సంబంధాలున్నాయ‌ని చాలా హాలీవుడ్ సినిమాలు కూడా వ‌చ్చాయి. దీంతో, తాజాగా నాసా కూడా గుర్తించ‌ని విష‌యాన్ని గుర్తించిన జో పై నెటిజ‌న్లు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. అయితే, ఈ విష‌యాన్ని నాసా వారు ధృవీక‌రించ‌లేదు. అంతేగాక‌, త‌న వీడియోల‌ను యూట్యూబ్ నుంచి తొల‌గించేందుకు యూట్యూబ్ యాజ‌మాన్యంతో నాసా చ‌ర్చ‌లు జ‌రుపుతోంద‌ని జో ఆరోపిస్తున్నాడు.