Begin typing your search above and press return to search.

టార్గెట్ గొట్టిపాటి... అద్దంకి నుంచి నార్నె పోటీ

By:  Tupaki Desk   |   1 March 2019 12:43 PM GMT
టార్గెట్ గొట్టిపాటి... అద్దంకి నుంచి నార్నె పోటీ
X
రాబోయే ఎన్నిక‌ల‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇందుకు త‌గిన కార్యాచ‌ర‌ణ‌ను ముంద‌కు తీసుకుపోతోంది. ప్ర‌తి చేరిక వెనుక కీల‌క ఎత్తుగ‌డ‌లు ప‌క్కాగా ఉండేలా కృషి చేస్తోంది. తాజాగా, సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నె శ్రీనివాసరావు నిన్న వైఎస్సార్‌ సీపీ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. రాబోయే ఎన్నిక‌ల్లో శ్రీనివాసరావు ప్రకాశం జిల్లాలోని అద్దంకి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని వార్తలు షికారు చేస్తున్నాయి. 2014 ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ తరపున అద్దంకి నుంచి గొట్టిపాటి రవికుమార్ విజయం సాధించారు. ఆ తర్వాత గొట్టిపాటి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ క్రమంలో రవికుమార్‌ ను ఢీకొట్టడానికి ఆర్థికంగా ఉన్న నాయకుడిని రంగంలోకి దించాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

పార్టీలో చేరిన సంద‌ర్భంగా నార్నె శ్రీనివాసరావు మాట్లాడుతూ పార్టీ కోసం పనిచేయడానికే వైసీపీలో చేరానని చెప్పారు. గత పదేళ్ల నుంచి వైసీపీ అధినేత జగన్‌ తోపాటు ఆయన కుటుంబసభ్యులతో అనుమంధం ఉందన్నారు. తాను ఏ సీటూ ఆశించడం లేదని.. జగన్‌ ను సీఎంగా చూడాలనుకుంటున్నానని చెప్పారు. కులాల పరంగా మాట్లాడడానికి తాను వ్యతిరేకినని.. అన్నివర్గాల వారూ జగన్‌ వెంట నడుస్తుననారని నార్నె అన్నారు. జగన్ దగ్గరకు చేరుతున్నారు. వైసీపీలో తన చేరికకు.. అల్లుడు జూనియర్‌ ఎన్టీఆర్‌ కు సంబంధం లేదని స్పష్టం చేశారు.

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల‌కు బ‌ల‌మైన అభ్య‌ర్థులతో పోటీ ఇవ్వాల‌ని క‌స‌ర్త‌తు చేస్తున్న వైసీపీ అధిన‌తే వైఎస్ జ‌గ‌న్ ఈ ఎత్తుగ‌డ‌లో భాగంగా నార్నె శ్రీ‌నివాస‌రావు చేరిక‌కు ఓకే చెప్పిన‌ట్లు స‌మాచారం. ఇప్ప‌టివ‌ర‌కు టికెట్ కేటాయింపుపై స్ప‌ష్ట‌మైన హామీ ఇవ్వ‌న‌ప్ప‌టికీ, అద్దంకి నుంచే బ‌రిలో దిగ‌నున్న‌ట్లు తెలుస్తోంది.