Begin typing your search above and press return to search.

20 రోజుల్లో ఐదుసార్లు భేటీ కానున్న మోడీ-జిన్ పింగ్

By:  Tupaki Desk   |   10 Nov 2020 12:45 PM IST
20 రోజుల్లో ఐదుసార్లు భేటీ కానున్న మోడీ-జిన్ పింగ్
X
గతంలో ఎప్పుడూ లేని రీతిలో భారత్ - చైనా మధ్య సరిహద్దుల్లో చోటు చేసుకుంటున్న ఉద్రిక్తతలు అంతకంతకూ పెరుగుతున్నాయే తప్పించి తగ్గని పరిస్థితి. తూర్పు లద్దాఖ్ లో ఇరు దేశాల బలగాలు మొహరింపు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్యనున్న ఉద్రిక్తతల్ని తగ్గించేందుకు వివిధ మార్గాల్లో.. వివిధ స్థాయిల్లో చర్చలు జరుపుతున్నా.. ఎలాంటి ఫలితం రాలేదు. ఇలాంటివేళ.. రానున్న 20 రోజుల్లో ఇరు దేశాల అధినేతలు పలు వేదికల్లో కలుసుకోనున్నారు. ఈ సందర్భంగా వారి మధ్య భేటీ జరిగే వీలుందన్న మాట వినిపిస్తోంది.

భారత్ - చైనాల మధ్య ఉద్రిక్తతలు తగ్గాలంటే.. అధ్యక్ష స్థానాల్లో ఉన్న ఇరువురు అధినేతలు భేటీ అయితే టెన్షన్ కొంతమేర తగ్గుతుందని చెబుతున్నారు. ఆసియాలోనే అతి పెద్దవైన.. అతి శక్తివంతమైన రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఇరు దేశాలకే కాదు.. మిగిలిన దేశాలకూ తలనొప్పేనని చెప్పక తప్పదు. ఇరవై రోజుల వ్యవధిలో హాజరయ్యే ఐదు సమావేశాల్లో మోడీ- జిన్ పింగ్ లు ఎదురెదురు పడే వీలుంది. ఈ సందర్భంగా చోటు చేసుకునే పరిణామాలు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది.

వీరిద్దరి మధ్య తొలి సమావేశంల షాంఘై సహకార సదస్సు జరగనుంది. వర్చువల్ వేదికగా జరిగే ఈ చర్చను రష్యా అధ్యక్షుడు పుతిన ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భారత్ - చైనా శాశ్విత సభ్య దేశాలు. తర్వాత రెండు రోజుల్లోనే అంటే 12-14 మద్య ఆసియన్ సదస్సులో ఈ ఇరువురు నేతలు మరోసారి హాజరు కానున్నారు. ఈ భేటీకి భారత్ ను వియత్నాం ప్రత్యేకంగా ఆహ్వానించింది.

దీని తర్వాత నవంబరు 17న జరిగే ఐదు దేశాల బ్రిక్స్ సదస్సులోనూ మోడీ - జిన్ పింగ్ ఎదురు పడనున్నారు. దీని తర్వాత నవంబరు 21-22లలో జీ20 దేశాల సదస్సు జరగనుంది. ఇందులో భారత్.. చైనా రెండు దేశాలు సభ్య దేశాలుగా ఉండనున్నాయి. సౌదీ అరేబియా ఈ సదస్సుకు అతిధ్యమిస్తోంది. చివరగా నవంబరు 30న జరిగే కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంటు లో నూ ఇరు దేశాల అధినేతలు హాజరు కానున్నారు. ఈ భేటీకి భారత్ అతిధ్యం ఇస్తోంది. మరి.. ఈ ఐదు వేదికల మీద ఇరు దేశాధినేతల మధ్య భేటీ ఎలాంటి పరిణామాలకు కారణమవుతుందో చూడాలి.