Begin typing your search above and press return to search.

మోడీ.. జిన్ పింగ్ లు ఎదురుపడే సీన్ కు డేట్ ఫిక్స్

By:  Tupaki Desk   |   6 Oct 2020 2:20 PM IST
మోడీ.. జిన్ పింగ్ లు ఎదురుపడే సీన్ కు డేట్ ఫిక్స్
X
దాయాది భారత్ - పాక్ మధ్య ఉన్న పంచాయితీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకు భిన్నంగా ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలతో డ్రాగన్ దేశాన్ని తన ప్రత్యర్థి దేశమన్న విషయాన్ని ప్రపంచానికి చాటి చెప్పేలా చేయటంతో మోడీ సర్కారు సక్సెస్ కావటమే కాదు. ఆ దేశంపై ఉండే ఒకలాంటి బెరుకును పక్కకు పోయేలా చేయటంలోనూ మోడీ విజయం సాధించారనే చెప్పాలి.

భారత్ ఎవరికి భయపడదని.. తమ ప్రయోజనాల్ని దెబ్బ తీసే ప్రయత్నం చేస్తే.. ఎవరికైనా చుక్కలే అన్న విషయాన్ని స్పష్టం చేసేలా ఇటీవల కాలంలో పలు పరిణామాలు చోటు చేసుకోవటం తెలిసిందే. ప్రధాని మోడీకి మంచి మిత్రుడిగా పేరున్న చైనా అధ్యక్షుడు జిన్ పింగ్.. ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలతో ఎడముఖం పెడ ముఖం అన్నట్లుగా ఉంటున్నారు. ఇలాంటి వేళ.. ఈ ఇద్దరు అగ్రనేతలు ఒకే వేదిక మీద ఎదురెదురుపడితే.. ఏమవుతుంది? ఎలాంటి సీన్ చోటు చేసుకుంటుందన్నది ఆసక్తికరకం.

బ్రిక్స్ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో భాగంగా ఇలాంటి సీన్ ఒకటి చోటు చేసుకోనుంది. తాజాగా ఈ సమావేశానికి సంబంధించి రష్యా డేట్ డిసైడ్ చేసింది. భారత్ - చైనా దేశాల సరిహద్దుల్లో తీవ్రస్థాయిలో వివాదాలు చోటు చేసుకున్న తర్వాత రెండు దేశాలకు చెందిన అగ్రనేతలు ఎదురుపడింది లేదు. తాజాగా తీసుకున్న నిర్ణయంతో మోడీ.. జిన్ పింగ్ లు నవంబరు 17న ఎదురెదురు పడనున్నారు. మరి.. ఆ టైంలో ఈ నేతలు ఎవరెలా వ్యవహరిస్తారన్న ఉత్కంట మరో నెలన్నర పైనే సాగనుందని చెప్పక తప్పదు.