Begin typing your search above and press return to search.

దేవ‌గౌడ ఆత్మ‌హ‌త్య వ‌ద్దు..కాంగ్రెస్ ది పీపీపీ స్థాయే!

By:  Tupaki Desk   |   5 May 2018 4:31 PM GMT
దేవ‌గౌడ ఆత్మ‌హ‌త్య వ‌ద్దు..కాంగ్రెస్ ది పీపీపీ స్థాయే!
X
పోలింగ్ తేదీ స‌మీపిస్తున్న కొద్దీ కర్ణాట‌క‌లో ఆస‌క్తికర‌మైన విమ‌ర్శ‌లు, ప్ర‌తి విమ‌ర్శ‌లు సాగుతున్నాయి. అధికార కాంగ్రెస్‌ - ప్ర‌తిప‌క్ష బీజేపీ ఒక‌రిపై మ‌రొక‌రు విమ‌ర్శ‌లు గుప్పించుకుంటున్నారు. తాజాగా కాంగ్రెస్‌పై ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ విరుచుకుప‌డ్డారు. కర్ణాటకలోని గడగ్‌ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సంద‌ర్భంగా కాంగ్రెస్‌పై విరుచుకుప‌డ్డారు. అవినీతికి కేరాప్ అడ్ర‌స్‌గా మారిన‌ కర్ణాటకలోని సిద్దరామయ్య అవినీతి ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడానికి బీజేపీకి ఓటు వెయ్యాలని ప్రధాని నరేంద్ర మోడీ మనవి చేశారు. ప్రజలు, రైతులు కష్టాలు తీర్చాలంటే బీఎస్. యడ్యూరప్పను ముఖ్యమంత్రిని చెయ్యాలని, అందుకు ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలకు మనవి చేశారు.

మే 15 తర్వాత కాంగ్రెస్ `పీపీపీ కాంగ్రెస్`గా మారిపోతుందని ప్ర‌ధాని మోడీ ఎద్దేవా చేశారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కాంగ్రెస్ కు పంజాబ్ - పుదుచ్చేరి - పరివార్ అనే 3 పీలు మాత్రమే మిగులుతాయన్నారు. అన్ని రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ ఓడిపోయిందని ఇప్పుడు కర్ణాటకలోనూ ఓడుతుందన్నారు. కర్ణాటకలో అవినీతి పెరిగిపోయిందని ఇక్కడ్నుంచే ఢిల్లీకి డబ్బులు వెళ్తున్నాయని మోడీ ఆరోపించారు. ఈ సంద‌ర్భంగా హంగ్ స‌హా ఇత‌ర అంశాల‌పై మోడీ ఘాటుగా స్పందించారు. తెరవెనుక కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు మంతనాలు జరుపుతున్నాయని ప్రధాని మోడీ ఆరోపించారు. అందుకు నిదర్శనం బీబీఎంపీ (బెంగళూరు)లో కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు ఒక్కటై మేయర్, ఉపమేయర్ పదవులు పంచుకున్నాయని, ఈ విషయం బహిరంగంగా అందరికీ తెలిసినా కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు మాత్రం ప్రజలను మోసం చెయ్యాలని ప్రయత్నిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపించారు.

దీంతోపాటుగా జేడీఎస్ అధినేత‌, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవేగౌడకు చుర‌కలు అందించారు. 2014లో తాను ప్రధాని అయితే అత్మహత్య చేసుకుంటానని గౌడ‌ అన్నారని ప్రధాని నరేంద్ర మోడీ గుర్తు చేశారు. అయితే తాను ప్రధాని అయ్యాయని, హెచ్.డి. దేవేగౌడ ఆత్మహత్య చేసుకోవల్సిన అవసరం లేదని, ఆయన అంటే తనకు గౌరవం ఉందని ప్రధాని మోడీ మర్యాదగానే ఆయనకు చురకలు అంటించారు. బీజేపీకి ఓటు వేసేందుకు ప్ర‌జ‌లు సిద్ధఃగా ఉన్నార‌ని రాబోయే ఎన్నిక‌ల్లో త‌మ పార్టీకి వారు మ‌ద్ద‌తుగా నిలుస్తార‌ని ప్ర‌ధాని ధీమా వ్య‌క్తం చేశారు.ఐదు సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటక ప్రజలకు ఏమి చేసిందని ప్రధాని నరేంద్ర మోడీ ప్రశ్నించారు. అవినీతి, రైతుల ఆత్మహత్యలు లాంటి వరాలు కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటక ప్రజలకు ఇచ్చిందని నరేంద్ర మోడీ విమర్శించారు. ఈ విష‌యాల‌ను ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నార‌ని వెల్ల‌డించారు.