Begin typing your search above and press return to search.

వామ్మో.. మోడీకి ఎంత ధైర్యం..?

By:  Tupaki Desk   |   23 March 2016 10:11 AM IST
వామ్మో.. మోడీకి ఎంత ధైర్యం..?
X
ప్రధాని మోడీకి అంత ధైర్యమా అని సగటు జీవి అనుకునేలా ఆయన తాజాగా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఊహించని విధంగా భారీ ఎత్తున బాంబు పేలుళ్లతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న బెల్జియంకు షెడ్యూల్ ప్రకారం జరగాల్సిన తన పర్యటన పక్కాగా జరుగుతుందని ప్రధాని స్పష్టం చేయటం గమనార్హం. ఉగ్రవాదుల హిట్ లిస్ట్ లో ఉన్న భారత ప్రధాని మోడీ.. మార్చి 30న బెల్జియం రాజధాని బ్రసెల్స్ లో జరగాల్సిన భారత్.. యూరోపియన్ యూనియన్ సదస్సుకు హాజరు కావాల్సి ఉంది.

తాజాగా చోటు చేసుకున్న భారీ బాంబుపేలుళ్ల నేపథ్యంలో ఆయన పర్యటన ఉంటుందా? అన్నది సందేహంగా మారింది. ఇలాంటి అనుమానాలకు చెక్ చెప్పిన ఆయన.. తాను వెళ్లటం ఖాయమన్న విషయాన్ని స్పష్టం చేశారు. యూరప్ లో భారత్ రెండో అతి పెద్ద వాణిజ్య భాగస్వామి అని.. ప్రధాని పర్యటన యథాతధంగా కొనసాగుతుందని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.

షెడ్యూల్ ప్రకారం మోడీ ఫర్యటన మార్చి 30న బ్రసెల్స్ కు వెళ్లే మోడీ.. ఆ తర్వాత వాషింగ్టన్ లో జరిగే అణుభద్రత సదస్సులో పాల్గొంటారు. ఆ తర్వాత సౌది అరేబియాలోని రియాద్ కు వెళ్లనున్నారు. బాంబుపేలుళ్లతో షాకింగ్ మారినా.. మోడీ మాత్రం వెనకడుగు వేయకుండా తన విదేశీ పర్యటనను కొనసాగించేందుకు పట్టుదలగా ఉండటం గమనార్హం.