Begin typing your search above and press return to search.
వైరల్ స్పీచ్!... మోదీ నోట తెలుగు ప్రసంగం!
By: Tupaki Desk | 28 Nov 2017 2:21 PM ISTప్రధానమంత్రి నరేంద్ర మోదీలో నిజంగానే ఏదో సమ్మోహన శక్తి ఉందని చెప్పాలి. గడచిన ఎన్నికల్లో తనదైన రీతిలో కొత్తగా సరికొత్తగా ప్రచారాన్ని ఊర్రూతలూగించిన మోదీ... పదేళ్ల పాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా లేకుండా చేసేశారు. అంతేనా... గడచిన దాదాపుగా మూడు దశాబ్దాల తర్వాత దేశంలో సంపూర్ణ మెజారిటీ కలిగిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. జాతీయ స్థాయి నేతలు చేయలేని పనిని... గుజరాత్ సీఎంగా ఉన్న ఓ రాష్ట్ర స్థాయి నేత హోదాలో జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించిన తొలి అడుగులోనే దేశ ప్రజలను తనవైపునకు తిప్పుకునే పనిలో ఆయన గ్రాండ్ సక్సెస్ అయ్యారని చెప్పాలి. మోదీ నోట నుంచి వచ్చే ప్రతి మాటా ఓ సమ్మోహనాస్త్రంగానే ఉంటుందని చెప్పక తప్పదు.
అయినా ఇవన్నీ మాకు తెలుసు కదా? మళ్లీ మీరు చెప్పడం ఎందుకంటారా? అయితే ఈ వార్తను మీరు పూర్తిగా చదవాల్సిందే. గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్ లో పాల్గొనడంతో పాటు హైదరాబాదు మెట్రో రైలును లాంఛనంగా ప్రారంభించేందుకు కాసేపటి క్రితం భాగ్యనగరికి వచ్చిన మోదీకి బేగంపేట ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా అక్కడే బీజేపీ నేతలు ఏర్పాటు చేసిన అభిందన సభలో మోదీ... హైదరాబాదీలను ప్రత్యేకించి తెలుగు ప్రజలు ముగ్ధులయ్యేలా ప్రసంగించారు. తెలంగాణ బీజేపీ నేతల పరిచయ కార్యక్రమం ముగిసిన వెంటనే మైకందుకున్న మోదీ... తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించారు.
అయినా మోదీ ఏమన్నారంటే *సోదర సోదరీమణులారా.. మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. హైదరాబాదుకు రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. హైదరాబాదు అంటే నాకు సర్దార్ పటేల్ గుర్తుకు వస్తారు. హైదరాబాదు సంస్థానాన్ని భారత దేశంలో కలిపిన సర్దార్ పటేల్ కు ఇక్కడి నుంచే ప్రణామం చేస్తున్నాను. తెలంగాణ ఉద్యమంలో అమరులైన వీరులకు నా జో్హార్లు. హైదరాబాదు ఒక అద్భుతమైన నగరం. నాలుగు కోట్ల నా తెలంగాణ ప్రజలకు నా అభినందనలు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉంది* అని అచ్చ తెలుగులో ప్రధాని చేసిన ప్రసంగానికి నిజంగానే హైదరాబాదీ ప్రజలు ఉప్పొంగిపోయారు. మోదీ ప్రసంగిస్తున్నంత సేపు కూడా జనం హర్షధ్వానాలతో సభా ప్రాంగణాన్ని మారుమోగించారు