Begin typing your search above and press return to search.

నిన్న యూట‌ర్న్ బాబు!.. నేడు స్టిక్క‌ర్ బాబు!

By:  Tupaki Desk   |   29 March 2019 8:14 PM IST
నిన్న యూట‌ర్న్ బాబు!.. నేడు స్టిక్క‌ర్ బాబు!
X
సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌తో పాటు అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రుగుతున్న ఏపీలో పొలిటిక‌ల్ హీట్ అమాంతంగా పెరిగిపోయింది. అసెంబ్లీ ఎన్నిక‌ల‌నే ల‌క్ష్యంగా చేసుకుని వైసీపీ - టీడీపీ - జ‌న‌సేన‌ల మ‌ధ్య మాట‌ల తూటాలు పేలుతుంటే... లోక్ స‌భ ఎన్నిక‌ల‌ను కేంద్రంగా చేసుకుని బీజేపీ కూడా త‌న‌దైన శైలి మంత్రాంగం నడుపుతోంద‌నే చెప్పాలి. ఏపీలో సింగిల్ గా బ‌రిలోకి దిగితే సింగిల్ సీటు కూడా ద‌క్కించుకోలేని స్థితిలో ఉన్న బీజేపీ... పోరాడితే కొంతైనా మెరుగుప‌డ‌క‌పోతామా? అన్న కోణంలో స‌ర్వ శ‌క్తుల‌ను ఒడ్డుతోంద‌నే చెప్ప‌క త‌ప్ప‌దు. ఈ క్ర‌మంలో నేడు రాష్ట్ర ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ క‌ర్నూలు వేదిక‌గా నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ‌లో త‌న‌దైన శైలి ప్ర‌సంగం చేశారు. ప్ర‌ధానంగా టీడీపీని టార్గెట్ చేసిన మోదీ... టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడిపై త‌న‌దైన శైలి పంచ్‌ లు - సెటైర్లు సంధించారు. గ‌తంలో చంద్ర‌బాబును యూట‌ర్న్ బాబుగా అభివ‌ర్ణించిన మోదీ... ఈ ద‌ఫా స్టిక్క‌ర్ల బాబుగా అభివ‌ర్ణించారు. కేంద్ర ప‌థ‌కాల‌కు త‌న స్టిక్క‌ర్లు వేసుకుని... ఆ ప‌థ‌కాలు త‌న‌వేన‌ని చెప్పుకుంటున్నార‌ని చంద్ర‌బాబుపై మోదీ విరుచుకుప‌డ్డారు.

కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులకు సంబంధించిన లెక్కలు అడిగితే చంద్రబాబు అడ్డం తిరిగారని మోదీ ఆరోపించారు. ఈ క్ర‌మంలోనే యూ టర్న్ తీసుకొన్న చంద్ర‌బాబు... నిధులు ఇస్తున్న‌ తనను టార్గెట్ చేశారని మండిపడ్డారు. ఈ సంద‌ర్భంగా మోదీ మ‌రో ఆస‌క్తిక‌ర అంశాన్ని ప్ర‌స్తావించారు. చంద్ర‌బాబు హ‌యాంలో భారీ ఎత్తున సాగుతున్న అవినీతిని ప్ర‌జ‌ల క‌ళ్ల‌కు కట్టేలా చెప్పిన మోదీ త‌న‌దైన శైలి వ్యాఖ్య‌లు చేశారు. సాధారణంగా పథకాలలో కుంభకోణాలు జరుగుతాయని, కానీ ఏపీలో చంద్ర‌బాబు పాల‌న‌లో అందుకు విరుద్ధ పరిస్థితి నెల‌కొందని పేర్కొన్నారు. తొలుత స్కాం అంచనా వేసి .. ఆ తర్వాత పథకాలను రూపొందిస్తున్నారని మోదీ మండిపడ్డారు. ఏపీకి ఇచ్చిన నిధులు అడగటమే పాపమైందన్న రీతిలో చంద్ర‌బాబు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. త‌మ‌ను బూచిగా చూపుతూ రాష్ట్రాభావృద్ధిని పక్కనపెట్టి .. అవినీతి నేతలతో చంద్ర‌బాబు జట్టు కట్టారని ఆరోపించారు. ఏపీ అభివృద్ధిపై చంద్రబాబు ఫోకస్ చేయనే లేద‌ని కూడా మోదీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

డెవలప్ మెంట్ పట్టించుకోకుండా .. కేంద్ర పథకాలకు స్టిక్కర్లు వేసుకొని, లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆరోపించారు. ఏపీ అభివృద్ధి కోసం మరోసారి అవకాశం ఇవ్వాలని. కేంద్రంలో - రాష్ట్రంలో తమకు అధికారం అప్పగిస్తే .. సంక్ఝేమం జోడుద్దుల్లాగా పయనిస్తోందని చెప్పారు. ఏపీలో 3 లక్షల కొత్త గ్యాస్ కనెక్షన్లు ఇచ్చామని మోదీ పేర్కొన్నారు పోలవరం ప్రాజెక్టుకు నిధులిస్తున్నా పనులు మాత్రం నత్తనడకన కొనసాగుతున్నాయని చెప్పారు. రాయలసీమ అభివృద్ది కోసం నరసింహారెడ్డి పోరాడితే, ఆ ప్రాంత నేత‌లే ప్రజలకు ద్రోహం చేస్తున్నారని విమర్శించారు. గుక్కెడు నీళ్ల కోసం సీమ‌ ప్రజలు అల్లడటానికి చంద్రబాబు కారణం కాదా అని కూడా మోదీ ప్రశ్నించారు. ఏపీలో ఎన్ఐటీ, ఐఐటీ, ట్రైబల్ వర్సిటీ, కర్నూలులో మెగా సోలార్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టింది తానేనని మోదీ గుర్తుచేశారు. పెట్రోలియం వర్సిటీ, ఐఐఎఫ్సీటీ, అనంతపురంలో కేంద్రీయ వర్సిటీ కేటాయించినట్టు తెలిపారు. పోలవరానికి జాతీయ హోదా ఇచ్చింది మీ చౌకీదార్ అని నొక్కి వక్కానించారు మోదీ. ఏపీ అభివృద్ధి కోసం చేయూతనిస్తానని, కానీ అందుకు సీఎం చంద్రబాబు సహకరించడం లేదని కూడా మోదీ మ‌రో సంచ‌ల‌న కామెంట్ చేశారు. ఏపీ కోసం నిధులు, పథకాలు ఇచ్చేందుకు సిధ్దంగా ఉన్నా .. చంద్ర‌బాబు కో ఆపరేషన్ లేదని చెప్పారు. మొత్తంగా చంద్ర‌బాబును టార్గెట్ చేసిన మోదీ... ప‌లు ఆస‌క్తిక‌ర అంశాల‌నే ప్ర‌స్తావించారు.