Begin typing your search above and press return to search.
మీ బంగారంపై మోడీ కన్ను?
By: Tupaki Desk | 12 Nov 2016 2:45 PM ISTపెద్ద కరెన్సీని రద్దు చేస్తూ మోడీ తీసుకున్న నిర్ణయంతో షాకైన లోకం ఇది ఇక్కడితో ఆగేది కాదంటోంది. మూలమూలల్లోని మూలుగుతున్న నోట్ల కట్టలను బయటకుతీయిస్తున్న మోడీ ఈ మిషన్ పూర్తయ్యాక బంగారం రంగు బయటపెడతారని అనుకుంటున్నారు.
దేశంలో లక్షల కేజీల బంగారం ఇళ్లలోని బీరువాల్లో - బ్యాంకుల లాకర్లలో మూలుగుతోంది. అయినా, పెట్టుబడి కోసమని.. అలంకరణ కోసమని.. ఇంకా లక్షలు పోసి బంగారం కొంటున్నారు. మన దగ్గర బంగారం ఉత్పత్తి తక్కువ కావడంతో ఇదంతా విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న బంగారమే. అక్రమంగా సంపాదించుకున్న డబ్బుతో బంగారం కొంటుంటే ఆ డబ్బు మనకు బంగారం ఎగుమతి చేసే దేశాలకు చేరుతోంది. మన దగ్గర మాత్రం బంగారం పెట్టుబడిగా కాకుండా నిరర్ధక ఆస్తిగా మిగులుతోంది. దేశ ఆర్థిక వ్యవస్థకు ఇది పెద్ద దెబ్బ. దీంతో క్యాష్ ప్లో పెంచడానికి గాను బంగారంపైనా సర్జికల్ స్ట్రైక్సు ఉంటాయని భావిస్తున్నారు.
ఇందుకోసం లాకర్లు తెరిపించడం... లెక్కలు చూపించాల్సిన పరిస్థితులు కల్పించడం.. తప్పకపోవచ్చు. ఇప్పటికే మోడీ ప్రభుత్వం బంగారానని బ్యాంకుల్లో జమ చేసే పథకానికి శ్రీకారం చుట్టినా అందుకు పెద్దగా రెస్పాన్సు రాలేదు. కానీ, ఇకపై అందుకు సంబంధించి నోట్ల నిర్ణయం వంటిదే తీసుకొచ్చి మెడపై కత్తి పెట్టే ఛాన్సుంది.
దీంతో ఇలాంటి ప్రమాదాన్ని ఊహిస్తున్న వారు ఇప్పుడు తమ వద్ద ఉన్న డబ్బుతో బంగారం కొనడం లేదు. ప్రమాదాన్ని ఊహించని వారు... అలాంటి ప్రమాదం వస్తే అప్పుడు చూసుకోవచ్చులే అనుకునేవారు మాత్రం ప్రస్తుతానికి తమ వద్ద ఉన్న డబ్బును ఎలాగైనా మార్చుకునే ప్రయత్నంలో అధిక ధరకు కూడా బంగారాన్ని కొంటున్నారు.
కాగా ఇప్పటికే బంగారం కొనుగోళ్లు పెరగడంతో ఎక్సైజ్ శాఖ ఆరా తీస్తోంది. బంగారం దుకాణాల్లో లావాదేవీల వివరాలు తెప్పించుకుంటున్నారు. నల్ల కుబేరులు తమ అక్రమ డబ్బును బంగారం రూపంలోకి మళ్లిస్తే ఆ వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే కొందరి వద్ద భారీగా ఉన్న బంగారం... తాజాగా నోట్ల రద్దు తరువాత కొన్నవి అన్నిటికీ కక్కించడానికి మోడీ మరోసారి సడెన్ ప్రెస్ మీట్ పెట్టడానికి ఎంతో కాలం పట్టకపోవచ్చు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/