Begin typing your search above and press return to search.
మోదీ కూడా 30ననే..రాత్రి 7 గంటలకు పీఎంగా ప్రమాణం
By: Tupaki Desk | 26 May 2019 10:23 PM ISTసార్వత్రిక సందడి ముగిసింది. గెలుపెవరిదో, ఓటమి ఎవరిదో కూడా తేలిపోయింది. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ఈ దఫా కూడా క్లిస్టర్ క్లియర్ మెజారిటీ సాధించింది. మరోమారు ప్రధానిగా మోదీ ప్రమాణం చేసేందుకు రంగం సిద్ధమైపోయింది. ఇటు సార్వత్రికంతో పాటే ఏపీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ బంపర్ మెజారిటీతో విక్టరీ కొట్టేసింది. వెరసి ఏపీకి నూతన సీఎంగా జగన్ పదవీ బాధ్యతలు చేపట్టేందుకు ముహూర్తాన్ని ఫిక్స్ చేసుకున్నారు.
ఈ నెల 30న మధ్యాహ్నం 12 గంటల 23 నిమిషాలకు విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో అట్టహాసంగా జరగనున్న ప్రమాణ స్వీకారోత్సంలో జగన్ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఇక ప్రదానిగా రెండో పర్యాయం ప్రమాణం చేయనున్న మోదీ కూడా జగన్ నిర్దేశించుకున్న 30 తేదీనే శుభ ముహూర్తంగా నిర్ణయించుకున్నారు. అయితే జగన్ మధ్యాహ్నం ఏపీకి నూతన సీఎంగా పదవీ బాద్యతలు చేపట్టనుండగా... మోదీ మాత్రం రాత్రి 7 గంటలకు ప్రధానిగా రెండో పర్యాయం ప్రమాణం చేయనున్నారు.
ఈ మేరకు ప్రధాని ప్రమాణ స్వీకారోత్సవానికి సంబంధించి క్లియర్ ప్రకటన వెలువడింది. రాష్ట్రపతి భవన్ లో ఏర్పాటు చేయనున్న ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్... మోదీ చేత రెండో సారి ప్రమాణ స్వీకారం చేయిస్తారు. మోదీతో పాటు పలువురు బీజేపీ ఎంపీలు కూడా ఇదే కార్యక్రమంలో కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేయనున్నారట. ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయం కాసేపటి క్రితం అధికారికంగా ఓ ప్రకటనను విడుదల చేసింది.