Begin typing your search above and press return to search.

రెండోసారి ప్రధానిగా మోదీ... 26న ముహూర్తం

By:  Tupaki Desk   |   23 May 2019 7:55 PM IST
రెండోసారి ప్రధానిగా మోదీ... 26న ముహూర్తం
X
సార్వత్రిక ఎన్నికల్లో విజయ దుందుభి మోగిస్తున్న ఎన్డీఏ.... కేంద్రంలో మరోమారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. నేటి ఉదయం ప్రారంభమైన కౌంటింగ్ లో ఆది నుంచి స్పష్టమైన మెజారిటీ దిశగా ఎన్డీఏ కూటమి సాగుతోంది. మ్యాజిక్ ఫిగర్ ను దాటేసి 330 స్థానాలకు పైగా సాధించే అవకాశాలున్నట్లుగా ట్రెండింగ్ కనబడటంతో ప్రధానిగా మరోమారు మోదీ ప్రమాణం చేసేందుకు సమాయత్తం అవుతున్నారు. బీజేపీ తరఫున గెలిచిన ఎంపీలతో ఈ నెల 25న భేటీ కానున్న మోదీ.. 26న ప్రధానిగా ప్రమాణం చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. 25న ఢిల్లీలో జరగనున్న బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి హాజరు కావాలంటూ ఇప్పటికే గెలిచిన అభ్యర్థులకు పార్టీ అధిష్ఠానం నుంచి సమాచారం వెళ్లింది.

ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి 330కి పైగా సీట్లు రానుండగా... అందులో బీజేపీ సింగిల్ గానే 292 సీట్లను గెలవనుంది. ఇక ఎన్డీఏ కూటమిలోని శివసేనకు 20 - జేడీయూకు 16 - ఎల్జేపీ 6 సీట్లను గెలవనున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేర మెజారిటీ సాధించనున్న ఎన్డీఏ... కూటమిలోకి కొత్త మిత్రులతో అవసరం లేకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశముంది. దీంతోనే కొత్త మిత్రల వేటను పక్కనపెట్టేసిన మోదీ... ఈ నెల 26న ప్రధానిగా పదవీ ప్రమాణం చేసేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నట్లుగా విశ్లేషణలు సాగుతున్నాయి.