Begin typing your search above and press return to search.
ఏపీలో మోదీ కొత్త వ్యూహాలకు పదును
By: Tupaki Desk | 5 Jun 2018 10:15 PM ISTఏపీలో రాజకీయం దాదాపుగా కులాలవారీగానే ఉంటుంది. ఉమ్మడి రాష్ట్రాన్ని ఏలింది ప్రధానంగా రెండే కులాలు. రెండూ అగ్ర కులాలే. అందులో ఒకటి కమ్మ వర్గం కాగా, రెండోది రెడ్డి సామాజికవర్గం. అయితే.. ఆశ్చర్యకరంగా ప్రస్తుత ఏపీలో ఈ రెండు సామాజికవర్గాల సంఖ్య చాలా తక్కువే. కమ్మ సామాజిక వర్గం సుమారు 4.8 శాతం ఉంటే రెడ్లు 6.5 శాతం ఉన్నారు. మరి... రాష్ట్రంలో బీసీలు ఎంతమంది ఉన్నారో తెలుసా.. 35.9 శాతం బీసీలున్నారు. ఎస్సీలు 17 శాతం ఉన్నారు.
ఇప్పుడీ లెక్కే బీజేపీని కొత్త వ్యూహాలు పన్నేలా చేస్తోంది. కమ్మ సామాజిక వర్గం టీడీపీతో.. రెడ్డి సామాజికవర్గం వైసీపీతో ఉంటుందన్నది సాధారణ అంచనా. ఇక బీసీలు - ఎస్సీల విషయానికొస్తే ఈ రెండు పార్టీలూ వీరి ఓట్లను పంచుకుంటున్నాయి. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీడీపీని ఎలాగైనా దెబ్బకొట్టాలన్న ఆలోచనతో ఉన్న బీజేపీ ఏపీలో ఎలాగైనా గేమ్ స్పోయిల్ చేయాలన్న ఉద్దేశంలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇందుకోసం బీసీలు -ఎస్సీలు... వారితో పాటు సంఖ్యాపరంగా ఎక్కువగా ఉన్నా రాజకీయంగా అధికారం అందుకోలేకపోతున్న కాపులను బీజేపీ, దాని అనుకూల పార్టీల వైపు తిప్పుకొనేలా బీజేపీ వ్యూహం పన్నుతున్నట్లు సమాచారం.
కాప -, బలిజ - ఒంటరి - తెలగ సామాజిక వర్గాలు కలిపి ఏపీలో 23.4 శాతం ఉన్నాయి. ఈ లెక్కన బీసీలు - కాపు - బలిజ - తెలగ - ఒంటరి సామాజికవర్గాలు కలిస్తే సుమారు 60 శాతం మంది ఉన్నట్లు. ఇప్పుడు బీజేపీ వీరినే లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. వీరిని ఆకట్టుకునేందుకు ఏం చేయాలనే విషయంలో బీజేపీ మేథోమథనం చేస్తున్నట్లు సమాచారం.
అలాగే పెద్ద ఎత్తున ఉన్న బీసీల్లో ప్రజాదరణ ఉన్న నేతలున్నా ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులను ఢీకొట్టేంత ఆర్థిక సామర్థ్యం ఉన్నవారు చాలా తక్కువ. దీంతో ఎన్నికల్లో ప్రభావం చూపగలిగే బీసీ - కాపు నేతలకు ఆర్థికంగా అండగా ఉండేలా బీజేపీ ఒక భారీ ప్రణాళిక ఏపీ కోసం రచిస్తున్నట్లు సమాచారం. మొత్తానికైతే ప్రస్తుతానికి ప్రాథమిక దశలో ఉన్న ఈ వ్యూహాలు ఎంతవరకు అమల్లోకి వస్తాయో చూడాలి.