Begin typing your search above and press return to search.
మోడీ బిజినెస్ ఐడియా బాగుందా?
By: Tupaki Desk | 17 Jan 2016 3:12 PM ISTప్రధానమంత్రి మోడీ స్టార్టప్ ఇండియా కార్యక్రమంలో భాగంగా వర్థమాన వ్యాపారస్తులకు ఓ చక్కటి బిజినెస్ ఐడియా ఇవ్వటం విశేషం. ఇంతకీ ప్రధాని ఇచ్చిన ఆ ఐడియా ఏమిటంటే.. గాలిని జొప్పించటం ద్వారా తయారుచేసే పానీయాల్లో రెండు శాతం సహజ పండ్ల రసాల్ని కలపాలని.. ఇలా చేస్తే పండ్ల రైతలతో పాటు.. వ్యాపారస్తులకు సరికొత్త మార్కెట్ లభిస్తుందని చెప్పుకొచ్చారు.
ఇంతకీ మోడీ బిజినెస్ ఐడియా వర్క్ వుట్ అవుతుందా? అంటే.. అవుననే చెబుతున్నారు పారిశ్రామికవర్గాలు. భారత పరిశోధన మండలి ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం.. రానున్న మూడేళ్లలో ఆల్కహాల్ రహిత పానీయాల మార్కెట్ దాదాపు 16 నుంచి 19 శాతం వృద్ధి చెందేటట్లు ఉందని అంచనా వేసింది. మరింత భారీగా ఎదిగే మార్కెట్ ను అందిపుచ్చుకోవాలని మోడీ కోరుకున్నారు. అందుకే ఆయన నోటి నుంచి బిజినెస్ ఐడియా వచ్చింది.
స్టార్టప్ ఇండియాలో తన ఐడియాను బాహాటంగా వెల్లడించిన ఆయన.. ఈ మధ్యన తనను కలిసిన ప్రముఖ పానీయాల సంస్థల అధిపతులతోనూ తానీ ఐడియా చెప్పినట్లుగా మోడీ పేర్కొన్నారు. మరి.. ప్రధాని ఇచ్చిన బిజినెస్ ఐడియాను ఎవరు అందిపుచ్చుకుంటారో చూడాలి.