Begin typing your search above and press return to search.

మోడీ వలవేశాడు..ఈయన చిక్కాడు..

By:  Tupaki Desk   |   18 Oct 2019 4:14 PM IST
మోడీ వలవేశాడు..ఈయన చిక్కాడు..
X
మోడీ వలవేశాడు.. మరో రాజ్యసభ ఎంపీ బీజేపీ చేతికి చిక్కాడు. రెండోసారి అధికారంలోకి వచ్చినా రాజ్యసభలో స్పష్టమైన బలం లేని బీజేపీ సర్కారు కీలక బిల్లులను గట్టేక్కించేందుకు మిత్రపక్షాల సాయం తీసుకుంటోంది. మొదటి దఫా కాంగ్రెస్ ఎంపీలు రాజ్యసభలో మెజార్టీగా ఉండడంతో వీలు కాలేదు. కానీ రెండో దఫాలో మోడీ సర్కారు మెజార్టీకి చేరువ కావడంతో బిల్లులన్నింటిని పాస్ చేస్తోంది.

ఇప్పటికే రాజ్యసభలో బలం కోసం టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ ఎంపీలను బీజేపీలో కలిపేసుకుంది. తాజాగా మరో కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీకి గాలం వేసింది.. అది వర్కవుట్ అయ్యింది.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తాజాగా సెప్టెంబర్ 14న పార్లమెంట్ స్థాయి సంఘాలను నియమించిన సంగతి తెలిసిందే. మన రాష్ట్రం నుంచి వైసీపీ సీనియర్ ఎంపీ విజయసాయిరెడ్డికి వాణిజ్యశాఖ వ్యవహారాల స్థాయి సంఘం చైర్మన్ గా నియమించింది. ఆ కోవలోనే సిబ్బంది, ప్రజా, న్యాయ చట్టాల వ్యవహారాల శాఖ సభ్యుడిగా కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ కేసీ రామమూర్తిని కేంద్ర ప్రభుత్వం నియమించింది. అత్యంత కీలకమైన ఈ పదవిని కర్ణాటక ఐపీఎస్ అధికారిగా చేసి రాజకీయాలపై ఆసక్తితో ఉద్యోగానికి రాజీనామా చేసి మరీ కాంగ్రెస్ లో చేరి ఎంపీగా గెలిచిన కేసీ రామమూర్తికి కట్టబెట్టడం ఢిల్లీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ప్రతిపక్ష ఎంపీకి ఈ కీలక బాధ్యతలు దక్కడం ఇదే తొలిసారి అట..

దీంతో సదురు కర్ణాటక రాజ్యసభ ఎంపీ రామమూర్తి తాజాగా తన రాజ్యసభ సభ్యత్వానికి.. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. బీజేపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు.

2016 జూన్ 11న కర్ణాటకలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి రాజ్యసభ ఎంపీలుగా ఆస్కార్ ఫెర్నండేజ్, జైరాం రమేష్ తోపాటు కేసీ రామమూర్తి కూడా పోటీచేశారు. 52 ఓట్ల మెజార్టీతో రామమూర్తి గెలిచాడు. ఈ మాజీ ఐపీఎస్ కు ఇప్పుడు కేంద్రంలో బీజేపీ పెద్ద పదవి ఆఫర్ చేయడంతో కాంగ్రెస్ కు రాజీనామా చేశాడు. ఆయన రాజీనామా కాంగ్రెస్ కు షాక్ ఇవ్వగా.. ఢిల్లీలో చర్చనీయాంశమైంది.