Begin typing your search above and press return to search.
మోదీజీ!..ఈ స్క్రిప్టెడ్ ఇంటర్వ్యూలేమిటండీ!
By: Tupaki Desk | 13 May 2019 10:17 PM ISTప్రధాన మంత్రి నరేంద్ర మోదీ... ఈ సార్వత్రిక ఎన్నికల్లో రోజులు గడుస్తున్న కొద్దీ మరీ డిఫెన్సివ్ మోడ్ లోకి వెళ్లిపోతున్నారు. ఎన్నికలు మొదలు కావడానికి ముందు చాలా ధైర్యంగానే కనిపించిన మోదీ... విడతల వారీ ఎన్నికల్లో ఒక్కో విడత ముగుస్తున్న కొద్దీ సెల్ఫ్ డిఫెన్సివ్ మోడ్ లోకి కూరుకుపోయారనే చెప్పాలి. మొన్నటికి మొన్న బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కు గంటల తరబడి ఇంటర్వ్యూ ఇచ్చిన మోదీ... అందులో మొత్తం తాను ముందుగానే నిర్దేశించుకున్న అంశాలనే అక్షయ్ నుంచి వచ్చేలా చేసుకున్నారన్న విమర్శలు వినిపించాయి. ఈ వ్యవహారాన్ని మరవక ముందే... తాజాగా న్యూస్ నేషన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూ మొత్తం స్క్రిప్టెడ్ ఇంటర్వ్యూగానే సాగిపోయిన వైనం మోదీ డొల్లతనాన్ని ఇట్టే బయటపెట్టేసిందని చెప్పక తప్పదు.
న్యూస్ నేషన్ టీవీ ప్రతినిధులు ప్రశ్నలు అడగటం, వాటికి ముందుగానే సమాధానాలు సిద్ధం చేసుకున్నట్లు మోదీ ఆన్సర్లిచ్చిన వైనం చూస్తుంటే...ఇది పక్కా స్క్రిప్డెట్ ఇంటర్వ్యూనేనని చెప్పక తప్పదన్న వాదన వినిపిస్తోంది. ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన విజువల్స్ విడుదల కాగానే.. మోదీని దునుమాడుతూ నెటిజన్లు ఓ రేంజిలో ఫైరయ్యారు. ఇక మోదీ ఎప్పుడెప్పుడు దొరుకుతారా? అంటూ కాసుక్కూర్చున్న కాంగ్రెస్ పార్టీ డిజిటల్ వింగ్ చీఫ్ దివ్య స్పందన... ఈ ఇంటర్వ్యూతో పాటు మోదీ తీరును ఎద్దేవా చేస్తూ ట్వీట్ చేశారు. ఈ ఇంటర్వ్యూకు చెందిన విజువల్స్ చూస్తే... అది ముమ్మాటికీ స్క్రిప్టెడ్ ఇంటర్వ్యూగానే తేలిపోయిందని ఆమె తనదైన సెటైర్లు సంధించారు.
ఇక ఈ వీడియోలో న్యూస్ నేషన్ టీవీ ప్రతినిధులు అడిగిన ప్రశ్నలు - వాటికి మోదీ చెప్పిన సమాధానాలు విన్న నెటిజన్లు చిర్రెత్తిపోయారు. 1990లో డిజిటల్ కెమెరా అందుబాటులోకి వస్తే... దానిని 1988లోనే వాడేశానని, దానితో బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ ఫొటోలు కూడా తీశానని మోదీ చెప్పుకొచ్చారు. ఆ తర్వాత 1995లో ఇంటర్నెట్ మెయిల్ సర్వీసులు అందుబాటులోకి వస్తే... మెయిల్ ను తాను 1988లోనే వినియోగించినట్లు మోదీ చెప్పుకోవడంపై నెటిజన్లు తమదైన శైలిలో మోదీని కడిగిపారేశారు. మొత్తంగా మొన్నటి అక్షయ్ కుమార్ ఇంటర్వ్యూతోనే అభాసుపాలైన మోదీ... ఈ సారి న్యూస్ నేషన్ టీవీకి ఇచ్చిన స్క్రిప్టెడ్ ఇంటర్వ్యూతో మరింతగా అభాసుపాలయ్యారన్న వాదన వినిపిస్తోంది.