Begin typing your search above and press return to search.
ఎంపీలు ఆడిగిన ఫేవర్ ను బయటపెట్టిన మోడీ
By: Tupaki Desk | 14 Nov 2016 9:35 AM ISTగడిచిన నాలుగైదు రోజులుగా పెద్దనోట్ల రద్దు నిర్ణయంపై దేశ వ్యాప్తంగా ఎలాంటి పరిస్థితి నెలకొని ఉందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ అంశంపై సామాన్యుల నుంచి అసమాన్యుల వరకూ తీవ్ర ప్రభావానికి గురి అవుతున్నారు. నోట్ల రద్దు నేపథ్యంలో ఆదివారం గోవాలో మాట్లాడిన సందర్భంగా ప్రధాని మోడీ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఒక దశలో ఆయన కళ్లల్లో కన్నీళ్లు తిరిగినంత పనైంది. ఆ వెంటనే తనను తాను సర్ది చెప్పుకున్నట్లుగా మోడీ తీరు కనిపించింది.
పెద్దనోట్ల రద్దు నిర్ణయం కారణంగా దేశంలో సంచలన మార్పులు చోటు చేసుకోనున్నట్లుగా చెప్పిన ప్రధాని మోడీ.. తాను తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం కారణంగా తన వ్యతిరేక శక్తులు తనను బతకనీయకపోవచ్చని.. ఏడు దశాబ్దాలుగా లూటీ చేసిన సొమ్ముచిక్కుల్లో పడటంతో వారు తనను నాశనం చేయొచ్చని.. అందుకు తాను సిద్ధంగా ఉన్నట్లుగా తేల్చేసిన మోడీ.. ఈ సందర్భంగా ఎంపీలు గాలి తీసే ఒక సంచలన విషయాన్ని చెప్పుకొచ్చారు.
బంగారు ఆభరణాల కొనుగోలు చేసేందుకు పాన్ కార్డు తప్పనిసరి చేయొద్దని గతంలో తనను పలువురు ఎంపీలు అడిగిన సంచలన విషయాన్ని బయటపెట్టారు.దేశంలోని సొమ్ము లూటీ చేసి దేశం దాటిస్తే దాని ఆచూకీ కనుకొనాలా? వద్దా? అని ప్రశ్నించిన ఆయన.. నల్లధనం కోరలు పీకమని తనను అడిగితే తాను చేయకుండా ఉంటానా? అంటూ తాను చేస్తున్న పనికి ప్రజల ఆమోద ముద్ర ఉన్న విషయాన్ని తనకు తానే మోడీ చెప్పటం గమనార్హం. ఏమైనా నీతులు చెప్పే ఎంపీలు కొందరు తనను అడిగిన ఫేవర్ గురించి బయటపెట్టి మోడీ సంచలనం సృష్టించారని చెప్పక తప్పదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/