Begin typing your search above and press return to search.

మోడీ నంబర్ 1..సోనియా 5..రాహుల్ 9

By:  Tupaki Desk   |   28 Feb 2016 4:25 PM IST
మోడీ నంబర్ 1..సోనియా 5..రాహుల్ 9
X
భారతీయుల్లో అత్యంత ప్రభావశీలురైన ప్రముఖుల జాబితాలో ప్రధాని నరేంద్ర మోడీ అగ్రస్థానంలో నిలిచారు. ఆర్‌ ఎస్‌ ఎస్ అధినేత మోహన్ భగవత్‌ కు రెండో స్థానం లభించింది. ఇండియన్ ఎక్స్‌ ప్రెస్ గ్రూప్ భారత్‌ కు చెందిన వందమంది ప్రముఖల జాబితాలో ఈ పవర్ లిస్టును రూపొందించింది. అనేక రకాలుగా వివాధాలు చుట్టుముడుతున్నప్పటికీ మోడీ జనాకర్షక శక్తి ఎంత మాత్రం తగ్గలేదని తెలిపింది. కాగా ఈజాబితాలో బీజేపీ - ఆరెస్సెస్ లకే మొదటి నాలుగు స్థానాలు దక్కాయి.

తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.... ఏపీలో సీఎం చంద్రబాబు కంటే బీజేపీ నేత - కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ముందు నిలిచారు. తెలంగాణలోనూ సీఎం కేసీఆర్ కంటే ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ముందు నిలిచారు.

అసహనంపై చర్చ - బిహార్‌ లో ఓటమి - రోహిత్ వేముల ఆత్మహత్య - జెఎన్‌ యు వివాదం ఇవన్నీ నీడలా వెంటాడుతున్నప్పటికీ ప్రధాని మోడీ నెంబర్ 1 స్థానంలో నిలిచారు. అలాగే ప్రస్తుత ప్రభుత్వంపై అత్యంత ప్రభావం కలిగిన ఆర్‌ ఎస్‌ ఎస్ అధినేత మోహన్ భగవత్ రెండో స్థానం దక్కించుకున్నారని జాబితా వెల్లడించింది. ప్రధాని మోదీకి సంఘ్ పరివార్ వెన్నుదన్నుగా నిలుస్తోందని ఈ పరివార్‌లో ప్రముఖ సంస్థగా ఆర్‌ ఎస్‌ ఎస్ తన ఉనికిని చాటుకునేలా మోహన్ భగవత్ నిరుపమాన కృషి చేస్తున్నారని తెలిపింది. ఇక మూడో స్థానంలో బిజెపి అధ్యక్షుడు అమిత్‌ షా - నాలుగో స్థానంలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, ఐదో స్థానంలో కాంగ్రెస్ అధినేత సోనియాగాంధీ ఉన్నారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి తొమ్మిదో స్థానం దక్కింది. ఢిల్లీ సిఎం కేజ్రీవాల్ ఎనిమిదో స్థానం దక్కింది.

టాప్ టెన్

1. మోడీ

2. మోహన్ భగవత్

3. అమిత్ షా

4. అరుణ్ జైట్లీ

5. సోనియా గాంధీ

6. ప్రణబ్ ముఖర్జీ

7. రాజ్ నాథ్ సింగ్

8. కేజ్రీవాల్

9. రాహుల్ గాంధీ

10. సుష్మా స్వరాజ్

- కాగా ఇటీవల రాజకీయంగా వివాదాల్లో ఉన్న కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ 13వ ప్లేసులో నిలిచారు.

- ప్రజాదరణ ఉన్న తమిళ సీఎం జయలలిత 19 స్థానంలో ఉన్నారు.

- ఈ జాబితాలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును వెంకయ్యనాయుడు డామినేట్ చేశారు. వెంకయ్యకు 37వ స్థానం దక్కగా చంద్రబాబుకు 44వ స్థానం దక్కింది.

- ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీకి 59వ స్థానం దక్కింది.

- మావోయిస్టు అగ్రనేత గణపతి 65 స్థానంలో ఉన్నారు.

- తెలంగాణ సీఎం కేసీఆర్ 81 వ స్థానంలో ఉండగా.... హైదరాబాద్ కే చెందిన తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ సానియా మీర్జా 85వ ప్లేసులో ఉన్నారు.