Begin typing your search above and press return to search.

మోడీ ప్రమోషన్ ఇస్తే అలా ఉంటుందా?

By:  Tupaki Desk   |   6 July 2016 10:17 AM IST
మోడీ ప్రమోషన్ ఇస్తే అలా ఉంటుందా?
X
మోడీ మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ పూర్తి అయ్యింది. నిన్నటి వరకూ అంచనాలుగా ఉన్నది కాస్తా నేడు నిజంగా మారిన పరిస్థితి. విస్తరణ విషయంలో మొదటి నుంచి వచ్చిన అభిప్రాయాలకు భిన్నంగా కొన్ని పరిణామాలు చోటు చేసుకోవటం గమనార్హం. అంచనా వేసిన అంశాలు కొన్ని వాస్తవరూపం దాల్చగా.. మరికొన్ని ఊహించని అంశాలు చోటు చేసుకున్నాయి. సార్వత్రిక ఎన్నికల సమయంలో నిత్యం తెగ హడావుడి చేసే ప్రకాశ్ జవదేకర్ కు కాస్త తగ్గమంటూ ఆయన పాత్రకు కత్తెర వేసిన మోడీ.. అనూహ్యంగా ఆయన్ను మరోసారి తెర మీదకు తీసుకురావటం గమనార్హం.

మధ్యప్రదేశ్ కు చెందిన ఈ నేత.. సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో టీడీపీ.. బీజేపీ మిత్రత్వం విషయంలో కీలకభూమిక పోషించారు. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు.. నాలుగు నెలలు హడావుడి చేసి..నిత్యం వార్తల్లో దర్శనం ఇచ్చినా.. ఆ తర్వాత మాత్రం తన దారిన తాను ఉండటం జరిగింది. అలాంటి ఆయనకు తాజాగా మరోసారి ప్రమోషన్ లభించింది. వేటు వేసే విషయంలో ఎలా ఉన్నప్పటికినీ.. ప్రమోషన్ ఇచ్చేందుకు మోడీ సిద్ధమైన వేళ.. ఆయన యాక్షన్ ఎలా ఉంటుందన్న విషయాన్ని తాజాగా కేంద్రమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ప్రకాశ్ జవదేకర్ చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం పర్యావరణ శాఖను స్వతంత్రంగా నిర్వహిస్తున్న జవదేకర్ కు తాజా ప్రమోషన్ గురించి మొదట ఆయనకు సమాచారం ఇచ్చింది ప్రధాని మోడీనే. జర్మనీలో జరుగుతున్న పర్యావరణ సదస్సులో ఉన్న వేళ ప్రధాని మోడీ నుంచి ఫోన్ వచ్చిందని.. ఆయనకు ప్రమోషన్ విషయాన్ని చెప్పి.. ఉన్నపళంగా ఢిల్లీకి బయలుదేరి రావాలని చెప్పారని జవదేకర్ వెల్లడించారు. ప్రధాని మోడీ నుంచి ఫోన్ అందుకున్న తర్వాత.. తన కార్యక్రమాల్ని రద్దు చేసుకొని ఢిల్లీలో వాలిపోయినట్లుగా వెల్లడించారు. డిమోషన్ సంగతి ఎలా ఉన్నా.. ప్రమోషన్ ఇస్తే మాత్రం మోడీనే స్వయంగా ఫోన్ చేస్తారన్న మాట.