Begin typing your search above and press return to search.

జగన్ కి మోదీ అభినందనలు - కేసీఆర్ కు ఫోన్!

By:  Tupaki Desk   |   19 July 2020 9:00 PM IST
జగన్ కి మోదీ అభినందనలు - కేసీఆర్ కు ఫోన్!
X
తాజాగా కరోనా పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోదీ 7 గురు ముఖ్యమంత్రులతో మాట్లాడారు. వారిలో తెలంగాణ సీఎం కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కూడా ఉన్నారు. పరీక్షలు చేసే మౌలిక సదుపాయాలు వేగంగా సమకూర్చుకుని, అత్యధిక సంఖ్యలో టెస్టులు చేస్తున్న ఏపీ ముఖ్యమంత్రిని ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు.

కరోనా వ్యాప్తి భారతదేశంలో సామాజిక వ్యాప్తి దశకు చేరుకున్నట్లు తాజా కేసులను బట్టి అర్థమవుతోంది. ఐసీఎంఆర్ అధికారికంగా ప్రకటించకపోయినా వైద్యమండలి, కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు దీనిని బహిరంగంగానే ప్రకటించారు. సామాజిక వ్యాప్తి లేకపోతే దేశంలో ఇన్ని కేసులు రావు అని అంతర్జాతీయ పత్రికలు కూడా రాశాయి. ఇన్ని కేసులు వస్తున్నా భారతదేశం సమర్థంగా ఎదుర్కోగలుగుతోంది.

కరోనా కట్టడికి తీసుకుంటున్న ఆయా రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యలు, ప్రస్తుత పరిస్థితులను వారిని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. కరోనా కట్టడిలో కీలకమైన టెస్టింగ్, ట్రేసింగ్ గురించి వారితో ఆరాతీశారు. కేంద్రం తరఫున ముఖ్యమంత్రులకు సూచనలు, సలహాలు ఇచ్చారు. తెలుగు రాష్ట్రాలు కాకుండా బీహార్, అస్సోం, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, తమిళనాడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడారు.

కరోనా నిర్ధారణ పరీక్షల్లో దేశంలో తమిళనాడు, ఏపీ రాష్ట్రాలు తొలి రెండు స్థానాల్లో ఉండటంతో వారిని మోదీ విడివిడిగా అభినందించారు. మరిన్ని పరీక్షలు, కాంటాక్ట్ ట్రేసింగ్ సమర్థంగా నిర్వహించి కరోనా వ్యాప్తిని కట్టడి చేయాలని సూచించారు.