Begin typing your search above and press return to search.
మోడీ అతి విశ్వాసం మరీ ఎక్కువైందా?
By: Tupaki Desk | 6 July 2019 8:00 PM ISTబలమైన వైరి పక్షం లేదు. కాంగ్రెస్ పార్టీనేమో ఇప్పుడప్పుడే కోలుకునే అవకాశాలు కనిపించడం లేదు. సరైన నాయకత్వం లేకపోవడం కాంగ్రెస్ ను కోలుకోనివ్వడం లేదు. అటు జాతీయ స్థాయిలో ప్రజాకర్షక నేత లేకపోవడం, రాష్ట్రాల వారీగా కూడా కాంగ్రెస్ ఎక్కడిక్కడ దివాళా తీసిన రీతినే అగుపిస్తూ ఉంది. ఇక ప్రాంతీయ పార్టీలకు పటిష్టమైన నాయకత్వం, క్యాడర్ ఉన్నా.. అవన్నీ చేతులు కలిపి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు ఏ మాత్రం కనిపించడం లేదు. అన్నింటికీ మించి అవసరానికి మించి సీట్లను ఇచ్చి మోడీని మళ్లీ ప్రధానిగా చేశారు దేశ ప్రజలు.
బీజేపీకి ప్రధానంగా సీట్లు వచ్చింది ఉత్తరాదిలోనే అయినా.. మెజారిటీ మాత్రం కావాల్సినంత ఉంది. ఈ నేపథ్యంలో అందుకు తగ్గట్టుగా అతి విశ్వాసంతో మోడీ పాలన సాగుతోందా? అనే భావన కలుగుతూ ఉంది.
బడ్జెట్ లో కేటాయింపులను చేసినా, ప్రజలపై పన్నుల బాదుడును గమనించినా ఈ విషయంల స్పష్టం అవుతుందని పరిశీలకులు అంటున్నారు. ఎలా పాలన సాగించినా అడ్డుకునే వారు లేరు, ఆపే వారు లేరు అన్నట్టుగా ఉంది పరిస్థితి. రాజకీయంగా ఎవరూ మోడీని ఇబ్బంది పెట్టే పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితే వస్తే..హిందుత్వ మంత్రాన్ని పఠించి కమలం పార్టీ సేఫ్ జోన్లోకి వెళ్తూ ఉంది.
ఇలాంటి క్రమంలో తాజా బడ్జెట్ లో కూడా ప్రజలను పెద్దగా పట్టించుకున్నట్టుగా కనిపించడం లేదు. ప్రజలను ఆకట్టుకోవడానికి పథకాలను పెట్టాల్సిన అవసరమో, వారి సంక్షేమం కోసమో పని చేయాల్సిన అవసరం మోడీకి పెద్దగా లేకుండా పోయింది. ఓట్ల కోసం వేరే రాజకీయం చేయొచ్చనే ధైర్యం కమలం పార్టీకి ఉంది.
అయితే ఈ అతివిశ్వాసంలో మోడీ ఇంకాఏమేం చేయబోతున్నారనేది ప్రశ్నార్థకంగా మారుతూ ఉంది. గత పర్యాయంలోనే మోడీ నోట్ల రద్దు వంటి కార్యక్రమంతో రాత్రికిరాత్రి దేశాన్నే ముప్పుతిప్పలు పెట్టారు. అయినా మళ్లీ ముందుకన్నా ఎక్కువ మెజారిటీ వచ్చింది. ఈ నేపథ్యంలో.. మోడీ ఇంకా ఏమేం చేయబోతున్నారో అనేది బడ్జెట్ తర్వాత చర్చనీయాంశంగా మారింది.