Begin typing your search above and press return to search.

మోడీ బండిలో ఉన్న స్పేస్ ఎంత‌?

By:  Tupaki Desk   |   3 Sept 2017 8:26 AM IST
మోడీ బండిలో ఉన్న స్పేస్ ఎంత‌?
X
రానున్న సార్వ‌త్రిక ఎన్నిక‌లే ల‌క్ష్యంగా మోడీ ఒక‌టి త‌ర్వాత ఒక‌టి చొప్పున పావులు క‌దుపుతున్నారు. తాజాగా కేంద్ర కేబినెట్ పున‌ర్ వ్య‌వ‌స్థీక‌ర‌ణ మీద దృష్టి సారించారు. ప‌ని తీరు ఆధారంగా మంత్రివ‌ర్గంలో మార్పులు చేయ‌టంతో పాటు.. వ్యూహాత్మ‌కంగా కొత్త వారికి అవ‌కాశాలు ఇచ్చేందుకు మోడీ సిద్ధ‌మ‌య్యారు. రానున్న కొద్ది నెల‌ల వ్య‌వ‌ధిలో వివిధ రాష్ట్రాల్లో జ‌రుగుతున్న ఎన్న‌కల్ని దృష్టిలో పెట్టుకోవ‌టంతో పాటు.. ఇటీవ‌ల కాలంలో వివిధ రాష్ట్రాల్లో చోటు చేసుకున్న రాజ‌కీయ ప‌రిణామాల ఆధారంగా కేబినెట్ లో స్థానం ల‌భిస్తుంద‌న్న ఆశాభావం వ్య‌క్త‌మ‌వుతోంది.

ప‌ని తీరు బాగోని ప‌లువురు మంత్రుల్ని త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామా చేయ‌మ‌ని చెప్ప‌టం ద్వారా.. ప‌ని విష‌యంలో త‌న‌కున్న క‌మిట్ మెంట్‌ను చెప్పేసిన మోడీ.. ఫ‌లితాలు చూప‌ని వారిపై వేటు త‌ప్ప‌ద‌న్న సంకేతాన్ని విస్పష్టంగా ఇచ్చార‌ని చెప్పాలి.

ఇదిలా ఉంటే.. మోడీ కేబినెట్ లో 81 మంది మంత్రులు ఉండే వీలుంది. నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా చూసిన‌ప్పుడు కేబినెట్ లో 81 మందిని తీసుకునే వీలుంది. ఉప రాష్ట్రప‌తిగా వెంక‌య్య నాయుడు త‌న మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేయ‌టం.. గోవా ముఖ్య‌మంత్రిగా మ‌నోహ‌ర్ పారీక‌ర్ వెళ్లాల్సి రావ‌టం లాంటి కార‌ణాల‌తో ప్ర‌స్తుతం 73 మంది మంత్రులే ఉన్నారు. వీరిలో ఏడుగురిపై వివిధ కార‌ణాలతో వేటు ప‌డింది. అంటే.. ఇప్పుడు మోడీ జ‌ట్టులో ఉన్న‌ది 66 మంది మాత్ర‌మే. మొత్తం 15 మందికి జ‌ట్టులో చేర్చుకునే అవ‌కాశం ఉంది.

మ‌రి.. మోడీ ఎంత‌మందికి అవ‌కాశం ఇస్తార‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగామారింది. భ‌విష్య‌త్ అవ‌స‌రాల దృష్ట్యా కొన్ని ప‌ద‌వుల్ని ఖాళీగా ఉంచొచ్చ‌న్న మాట వినిపిస్తోంది. మొత్తానికి మొత్తంగా ఫిల్ చేసేక‌న్నా.. కొంత ఖాళీ ఉంచ‌టం ఖాయ‌మ‌ని చెబుతున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కూ బ‌య‌ట‌కు వ‌చ్చిన అన‌ధికార పేర్ల‌ను చూస్తే తొమ్మిది మంది మాత్ర‌మే ఉన్నారు. అంటే.. ఇంకా ఆరుగురికి కేబినెట్ లో చోటు ల‌భించే వీలుంది. హ‌రిబాబు - శ్రీరాం వెదిరె లాంటి వారికి కూడా కేబినెట్ లో స్థానం ల‌భిస్తుంద‌న్న మాట వినిపిస్తున్నా.. అందుకు త‌గిన‌ట్లుగా సంకేతాలు రాని నేప‌థ్యంలో ఈ ఉదయం 10.30 గంట‌ల‌కు జ‌రిగే ప్ర‌మాణస్వీకారం కార్య‌క్ర‌మంలో పూర్తి క్లారిటీ రానుంది. మొత్తంగా చూస్తే.. ఉన్న ఖాళీల్ని భ‌ర్తీ చేసే అవ‌కాశం త‌క్కువ‌గా ఉంద‌ని చెబుతున్నారు.

బ‌య‌ట‌కు వ‌చ్చిన పేర్లు ఇవే..

1. అశ్వినీకుమార్ చౌబే

2. గ‌జేంద్ర సింగ్ షెకావ‌త్‌

3. శివ‌ప్ర‌తాప్ శుక్లా

4. హ‌ర్దీప్ సింగ్ పూరీ

5. స‌త్యాప‌ల్ సింగ్‌

6. రాజ్ కుమార్ సింగ్

7. అల్ఫోన్స్ క‌న్న‌న్ త‌నం

8. వీరేంద్ర కుమార్‌

9. అనంత‌కుమార్ హెగ్డే