Begin typing your search above and press return to search.
సుప్రీంతో మోదీ ఢీ!
By: Tupaki Desk | 14 April 2015 8:20 PM ISTకేంద్రంలో ప్రభుత్వం ఏదయినా న్యాయ వ్యవస్థతో డిష్యుం డిష్యుం తప్పదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో శాసన ా కార్య నిర్వాహక ా న్యాయ వ్యవస్థల మధ్య యుద్ధం నడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు మోదీ ప్రభుత్వం కూడా న్యాయ వ్యవస్థతో ఢీ అంటే ఢీ అంటోంది. ఈ అంశం దేశంలో విచిత్ర పరిణామాలకు దారితీసే పరిస్థితులూ కనిపిస్తున్నాయి.
మన దేశంలో న్యాయమూర్తులను న్యాయమూర్తులే నియమించుకుంటారు. 1993 నుంచి ఈ వ్యవస్థ అమల్లోకి వచ్చింది. దీనినే కొలీజియం వ్యవస్థ అని అంటారు. ఐదుగురు సీనియర్ న్యాయమూర్తులతో కూడిన కొలీజియం సుప్రీం కోర్టు, దేశవ్యాప్తంగా 24 హైకోర్టుల్లోని న్యాయమూర్తుల బదిలీలు, పదోన్నతులను నిర్ణయిస్తుంది. ఆ ప్రతిపాదనలను ప్రభుత్వానికి కూడా పంపినా కొలీజియం నిర్ణయమే ఫైనల్. అయితే, కొలీజియం వ్యవస్థపై కొన్నేళ్లుగా తీవ్రస్థాయిలో విమర్శలు ఉన్నాయి. న్యాయమూర్తులే న్యాయమూర్తులను నియమించడం ఏమిటనే అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ విధానంతో ఆశ్రిత పక్షపాతం, అవినీతి అక్రమాలు చేరాయనే విమర్శలు వచ్చాయి. తమిళనాడులో కొంతమంది న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించిన ఉదాహరణలూ తెరపైకి వచ్చాయి.
న్యాయ వ్యవస్థపై శాసన వ్యవస్థ పట్టు పూర్తిగా తగ్గిపోతుండడంతో పట్టు బిగించాలని ప్రభుత్వం భావించింది. కొలీజియం వ్యవస్థను రద్దు చేసి న్యాయ నియామకాలకు ప్రత్యేక కమిషన్‌ను తీసుకు రావాలని యూపీఏ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, అందుకు అప్పట్లో సుప్రీం ప్రధాన న్యాయమూర్తులు, న్యాయ నిపుణులు తీవ్రంగా అభ్యంతరం చెప్పారు. దాంతో, న్యాయ వ్యవస్థతో తగాదా పెట్టుకోవడం ఇష్టం లేని యూపీఏ ప్రభుత్వం (అసలే కేసుల్లో ఇరుక్కోవడం వల్ల ఏర్పడిన భయం కావచ్చు) న్యాయ నియామకాల బిల్లును అటకెక్కించింది.
కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొలీజియంపై చర్చ జరిగింది. ఎప్పట్లానే సుప్రీం న్యాయమూర్తులు దీనిని తీవ్రంగా వ్యతిరేకించారు. అయినా, ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. న్యాయ నియామకాల కమిషన్ బిల్లుకు పార్లమెంటు ఆమోదం పొందింది. దాంతో పార్లమెంటులో చేసిన చట్టంపై సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిపై విచారణ బుధవారం జరగనుంది. ఈలోపులోనే కేంద్రం చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. వాస్తవానికి, మన ప్రజాస్వామ్య దేశంలో పార్లమెంటే సుప్రీం. అది చేసిన చట్టాలపై న్యాయ సమీక్ష ఉండదు. అయినా, పార్లమెంటులో వ్యాజ్యాలు విచారణకు వస్తే, చట్టం అమలు ఆలస్యమవుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వం సత్వరం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ఇప్పుడు శాసన, న్యాయ వ్యవస్థల మధ్య ఘర్షణకు కారణమైంది.