Begin typing your search above and press return to search.

మన్ కీ బాత్ తో మోడీ ఏం నేర్చుకున్నారు?

By:  Tupaki Desk   |   20 Sept 2015 2:31 PM IST
మన్ కీ బాత్ తో మోడీ ఏం నేర్చుకున్నారు?
X
ప్రధాని నరేంద్రమోడీ అధికారం చేపట్టిన తరువాత ఎన్నో కొత్త కార్యక్రమాలకు తెరలేపారు. ప్రజల్లో మార్పు తేవాలనీ ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా సామన్యుల నుంచీ అందరికీ చేరువవ్వాలనే ఉద్దేశంతో 'మన్ కీ బాత్' పేరుతో రేడియో ప్రోగ్రాంలో ప్రజలనుద్దేశించి మాట్లాడుతున్నారు. ఆదివారం నిర్వహించిన మన్ కీ బాత్ లో మోడీ మాట్లాడుతూ... ''ఈ కార్యక్రమం ద్వారా నేను ఎంతో నేర్చుకున్నాను'' అని తెలిపారు.

అయితే... మోడీ ఏం నేర్చుకుని ఉంటారు మీరేమైనా ఊహించగలరా...? ఇంకేముంది.. ప్రజలు రేడియో వినడం మానేసి చాలాకాలం అయిందని అర్థమయ్యుంటుంది. అంతేకాదు.. రేడియోలో మాట్లాడితే ఎవరూ వినరనీ అర్థమయ్యుంటుంది.

అంతేనా... ఇంకా చాలా ఉంది.. ఎవరూ వినరు కాబట్టి ఎన్నయినా చెప్పొచ్చని కూడా మోడీ నేర్చుకున్నారట. అందుకే మన్ కీ బాత్ లో ఆయన ప్రజలకు సూక్తిముక్తావళి వినిపిస్తున్నారు. ప్రజలంతా తక్కువ ఖర్చుతో ఖాదీ వస్త్రాలు దరించాలని మోడీ పిలుపునిచ్చారు. తాను మాత్రం బంగారు తీగలతో మోడీ.. మోడీ అని కుట్టిన సూట్లు వేసుకుంటానని మాత్రం చెప్పలేదు. నిజానికి ఆయన 'మన్ కీ బాత్' అదే అయినప్పటికీ ఆ సంగతి తెలిస్తే ప్రజలు చీవాట్లు పెడతారని ఒబామా వచ్చినప్పుడే నేర్చుకోవడం వల్ల ఆయన ఇప్పుడావిషయం చెప్పలేదు.

ఇంకో విషయం ఏంటే ధనికులు గ్యాస్ రాయితీని వదులుకొని పేద ప్రజలకు చేయూతనివ్వాలని మోడీ తన మన్ కీ బాత్ కార్యక్రమంలో కోరారు. తన పిలుపుతో ఇప్పటి వరకు 30లక్షల మంది గ్యాస్ సబ్సిడీని వదులుకున్నారని ఆయన చెప్పారు. ఆధార్ నంబర్, బ్యాంకు అకౌంటు ఇచ్చినా కూడా బ్యాంకులో గ్యాస్ సబ్సిడీ పడని వారందరినీ లెక్కేస్తున్నట్టున్నారు మోడీ సార్.