Begin typing your search above and press return to search.

మోడీ స్నేహహస్తం.. అనూహ్య నిర్ణయం..

By:  Tupaki Desk   |   20 Jun 2019 9:53 AM IST
మోడీ స్నేహహస్తం.. అనూహ్య నిర్ణయం..
X
లోక్ సభ స్పీకర్ ఎన్నిక పూర్తయ్యింది. ఇక డిప్యూటీ సీఎం ఎంపి కే మిగిలింది. అత్యధిక మెజార్టీతో కేంద్రంలో అదికారంలోకి వచ్చిన బీజేపీ గత సంప్రదాయాలను పాటిస్తూ విపక్షానికి డిప్యూటీ స్పీకర్ పదవి ఇస్తుందా లేదా.. పోయిన సారి మిత్రపక్షమైన అన్నాడీఎంకే కు ఇచ్చినట్టు ఈసారి మరో మిత్రుడికి ఇస్తుందా అనేది ఆసక్తిగా మారింది.

రెండోసారి బీజేపీ అఖండ మెజార్టీతో గద్దెనెక్కాక.. సంప్రదాయాలు - విలువలు గురించి ఎవరూ మాట్లాడే సాహసం చేయడం లేదు. అందుకే కేవలం రెండు సార్లు మాత్రమే గెలిచిన రాజస్థాన్ ఎంపీని స్పీకర్ ను చేసినా ఎవరూ నోరు మెదపలేదు.

ఈసారి మిత్రపక్షం అన్నాడీఎంకే ఒక్క ఎంపీ సీటు కూడా గెలవకపోవడంతో అస్సలు ప్రాతినిధ్యమే లోక్ సభలో లేకుండా పోయింది. దీంతో శివసేన - వైసీపీలకు డిప్యూటీ స్పీకర్ పదవి దక్కబోతోందని ప్రచారం జరిగింది. అయితే వైసీపీ తమకు డిప్యూటీ స్పీకర్ ఆఫర్ రాలేదని.. అలాంటి ప్రతిపాదన ఏదీ లేదని చెబుతున్నారు.

ఇక ఫైనల్ గా ఒడిషాకు చెందిన బిజు జనతాదళ్ కు డిప్యూటీ స్పీకర్ ఆఫర్ మోడీ ఇచ్చినట్టు సమాచారం. ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ కూడా మోడీ ఆఫర్ కు ఓకే చెప్పినట్టు సమాచారం. కటక్ నుంచి ఎంపీగా గెలిచిన సీనియర్ నేత మెహతాబ్ కు డిప్యూటీ స్పీకర్ పదవి ఖాయమైనట్టు ఢిల్లీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

1998 నుంచి వరుసగా ఎంపీగా గెలుస్తూ వస్తున్న మెహతాబ్ ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డ్ కూడా పొందాడు. మంచి వక్త అయిన మెహతాబ్ కే డిప్యూటీ స్పీకర్ పదవి దక్కబోతోందని ఢిల్లీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.