Begin typing your search above and press return to search.
అబ్బో.. నెల రోజులకు తీరిందా మోడీజీ?
By: Tupaki Desk | 9 Aug 2016 10:46 PM ISTప్రధాని మోడీ ఎంత ఫాస్ట్ గా ఉంటారో అందరికి తెలిసిందే. ఆ మధ్యన తన రాజకీయ ప్రత్యర్థి.. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తన అడ్డా అయిన వారణాసిలో యూపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని షురూ చేయటం.. ఆ సందర్భంగా చేతిని పదే పదే ఊపటంతో.. ముంజేతి ఎముక ఫ్యాక్చర్ కావటం తెలిసిందే. ఆమె ఆరోగ్య పరిస్థితి కాస్త సీరియస్ గా ఉందన్న సమాచారం తెలిసీ తెలియటంతోనే యుద్ధ ప్రాతిపదికన ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసి.. ఆమె ఢిల్లీ ఎయిర్ పోర్ట్ కు చేరుకునేలోపు.. అత్యాధునిక వైద్యం అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేసి.. కాంగ్రెస్ పార్టీ నేతల మనసుల్ని దోచుకున్న వైనం చూస్తే మోడీ ఎంత జెట్ స్పీడ్ గా నిర్ణయాలు తీసుకుంటారో ఇట్టే అర్థమవుతుంది. మరంత వేగంగా స్పందించే మోడీ.. గడిచిన 31 రోజులుగా అట్టుడికిపోతున్న కశ్మీర్ విషయంలో పట్టనట్లుగా ఎందుకు ఉండనట్లు? అన్న ప్రశ్నకు సమాధానం లభించని పరిస్థితి.
హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాది బుర్హాన్ వనిని భద్రతాదళాలు ఎన్ కౌంటర్ చేసిన నేపథ్యంలో కశ్మీర్ లోయలో అశాంతి చోటు చేసుకోవటం.. పెద్ద ఎత్తున ఆందోళనలు మొదలయ్యాయి. అవి అంతకంతకూ పెరగటమే కాదు.. 31 రోజుల తర్వాత కూడా ఒక కొలిక్కి రాని పరిస్థితి. కశ్మీర్ లోని 10 జిల్లాల్లో నిరవధిక కర్ఫ్యూను అమలు చేస్తున్న దుస్థితి. అంతేకాదు.. ఈ ఆందోళనల కారణంగా ఇప్పటివరకూ 56 మంది మరణించగా.. వేలాది మంది గాయాలపాలైన పరిస్థితి. అయినప్పటికీ ప్రధాని మోడీ ఇప్పటివరకూ స్పందించింది లేదు.
తాజాగా ఆయన కశ్మీర్ అంశంపై నోరు విప్పారు. మధ్యప్రదేశ్ లో ఏర్పాటు చేసిన క్విట్ ఇండియా కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించిన మోడీ.. కశ్మీర్ లో శాంతి.. సామరస్యాలను పునరుద్ధరించేందుకు సాయం చేయాలని ప్రజల్ని కోరారు. యువతరం చేతుల్లో ఉండాల్సినవి ల్యాప్ టాప్స్, బాల్స్, బ్యాట్స్ అని పేర్కొంటూ.. అలాంటి ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్లుండాల్సిన కాశ్మీరీ యువకులు రాళ్లు పట్టుకుంటున్నారని మోడీ ఆవేదన వ్యక్తంచేశారు . గొప్ప సంస్కృతిని కొందరు తప్పుదారి పట్టిస్తున్నారన్న ఆవేదనను వ్యక్తం చేసిన ఆయన.. ‘‘కశ్మీర్ శాంతి కోరుకుంటోంది. కశ్మీర్ పౌరుడు పర్యాటకం ద్వారా డబ్బు సంపాదించాలని కోరుకుంటున్నాడు. దేశంలో ప్రతి పౌరుడికిఉన్న స్వేచ్ఛ కశ్మీర్ పౌరుడికి ఉంది. కశ్మీర్ యువత ఉజ్వల భవిత ఇవ్వాలని భావిస్తున్నాం’’ అని చెప్పుకొచ్చారు. మరి.. అంత కమిట్ మెంట్ ఉన్నప్పుడు గడిచిన 31 రోజులుగా ప్రధాని ఎందుకు రియాక్ట్ కానట్లు? ఇప్పుడే కశ్మీర్ ఎందుకు గుర్తుకు వచ్చినట్లో..?