Begin typing your search above and press return to search.
మోడీ తెస్తున్న మరో బ్రహ్మాస్త్రం ఇదే..
By: Tupaki Desk | 17 Nov 2019 1:21 PM ISTనోట్ల రద్దు.. ప్చ్ ఫలితమివ్వలేదు.. జీఎస్టీ.. మొదటికే మోసం వచ్చింది. అధికారంలోకి వచ్చాక నల్లడబ్బును వెలికి తీసి పేదలకు పంచుతానన్న మోడీ ఆశలు నెరవేరలేదు. మరింక ఏమీ చేయాలి. రెండోసారి అధికారం ఇచ్చిన ప్రజలకు ఇచ్చిన హామీని ఎలాగైనా నెరవేర్చాలి. అందుకే మోడీ మరో అస్త్రం తీయబోతున్నారు. ఇప్పటికే కశ్మీర్ విభజన, ట్రిపుల్ తలాక్, అయోధ్యపై దూకుడుగా ముందుకెళ్లిన మోడీ ఇప్పుడు దేశంలో పేదలకు ఇళ్ల స్థలాలు, భూముల ధరలను అందుబాటులోకి తెచ్చేందుకు సరికొత్త అస్త్రాన్ని బయటకు తీస్తున్నారు.
ప్రస్తుతం ఆర్థిక మాంద్యం దేశాన్ని పట్టిపీడిస్తోంది. నల్ల డబ్బు అంతా ఇప్పటికే రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులుగా మారిపోయిందని కేంద్రం గుర్తించింది. నల్లడబ్బును బడాబాబులు అంతా భూములు - ఇళ్లు - ఆస్తులు కొనేసి పెట్టుకున్నారని గుర్తించింది. చాలా మంది బినామీ పేర్లతో వీటిని కొని పెట్టారని తేల్చింది. దీంతో ఈ అక్రమార్కుల ఆట కట్టించేందుకు కేంద్రం రెడీ అయ్యింది.
దేశంలోని మొత్తం ఆస్తులకు ఆధార్ అనుసంధానం చేయబోతోంది. ఇక నుంచి ఏ ఆస్తికి ఎవరి ఆధార్ అనుసంధానం ఉంటే వారిదే ఆస్తి. ఇక ఇబ్బడిముబ్బడిగా ఆస్తులు కొన్న వారి ఆధార్ లింక్ తో వారి బండారం బయటపడుతుంది. వారిపై ఐటీ దాడులు జరుగుతాయి. తద్వారా వారి అక్రమాస్తులు బయటపడుతాయి.
ఇక మరో విశేషం ఏంటంటే.. ఆధార్ తో ఆస్తుల లింక్ తో బినామీల ఆస్తుల గుట్టు బయటపడుతుంది. ఓకే ఆధార్ తో పెద్దఎత్తున ఆస్తులను కలిగి ఉండడం అసాధ్యం. ఈ చర్యతో రియల్ ఎస్టేట్ రంగం నుంచి అక్రమాలను నిర్మూలించడం కేంద్రానికి సాధ్యమవుతుంది.
ఇప్పటికే నల్లడబ్బు అంతా రియల్ ఎస్టేట్ లోకి చేరడంతో భూములు - ఇళ్ల ధరలకు కోట్ల డిమాండ్ వచ్చేసింది. దీంతో సామన్య, మధ్యతరగతి జనాలకు సెంట్ భూమి - ఇళ్లు కొనడం సాధ్యపడడం లేదు. మోడీ 2020లో అందరికీ ఇళ్లు పథకం తెస్తున్నాడు. దీన్ని అమలు చేయడానికే తాజాగా ఆధార్ తో ఆస్తుల లింక్ చట్టం తెస్తున్నాడు. ఇది అమలైతే భూములు - ఇళ్ల ధరలు తగ్గి పేదలకు అందుబాబులోకి వస్తాయి. మరి మోడీ వేస్తున్న ఈ బ్రహ్మాస్త్రం ఏమేరకు ప్రభావం చూపుతుందనేది వేచిచూడాలి.