Begin typing your search above and press return to search.
పెద్దన్నకు బుద్ధి చెప్పేందుకే భారత ‘‘నావిక్’’?
By: Tupaki Desk | 29 April 2016 10:48 AM ISTఅంతరిక్ష పరీక్షల్లో వరుస విజయాలు సాధిస్తున్న ఇస్రో గురువారం మరో ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. ఈ ప్రయోగం పూర్తి చేసిన వెంటనే శాస్త్రవేత్తలు సంబరాలు చేసుకోవటం.. మీడియాలో ప్రముఖంగా ప్రస్తావించటం.. దేశ ప్రధాని అభినందనలు తెలపటం లాంటివి వరుసగా జరిగిపోయాయి. ఎప్పటి మాదిరి ఇస్రో చేసిన ప్రయోగం లాంటిదే ఈసారి కూడా అన్న మాట అనుకుంటే తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే.. తాజా ప్రయోగం కారణంగా దేశీయంగా మనదైన నావిగేషన్ వ్యవస్థ మన సొంతమైంది. మరో రెండు నెలల్లో అందుబాటులోకి రానున్న నావిగేషన్ వ్యవస్థ కారణంగా విదేశీయులు ఇచ్చే నావిగేషన్ వినియోగించుకోవాల్సిన అవసరం ఉండదు.
ఇప్పటికే నావిగేషన్ వ్యవస్థ అందుబాటులో ఉంటే.. మళ్లీ ఈ ప్రయోగం ఎందుకు? ఇంత సంబరం ఎందుకు? అన్న డౌట్ రావొచ్చు. కానీ.. దీని వెనుక ఒక భావోద్వేగ కోణం ఉంది. గతంలో జరిగిన అవమానానికి బదులిచ్చిన వైనం ఉంది. ఈసారి ప్రయోగించిన ఉప గ్రహానికి ‘‘నావిక్’’ అనే పేరును పెట్టారు. ఈ పేరు పెట్టటానికి ఎలాంటి కారణం ఉందో.. అసలీ ప్రయోగం వెనుక అలాంటి కారణమే ఉందని చెప్పాలి.
నావిక్ ను ఎందుకు తయారు చేయాల్సి వచ్చిందన్న విషయం తెలుకుంటే.. ఈ ప్రయోగం గొప్పతనం ఏమిటో ఇట్టే అర్థమవుతుంది. సమర్థవంతమైన జీపీఎస్ సేవలు ఇప్పటికే అందుబాటులో ఉన్నా.. స్వదేశీ నావిగేషన్ సిస్టం ఎందుకు అవసరం అన్నది తెలుసుకోవాలంటూ దాదాపు 17 సంవత్సరాల వెనక్కి వెళ్లాలి. 1999లో కార్గిల్ లో పాక్ దళాలు తిష్ట వేయటం తెలిసిందే. వారిని తరిమి కొట్టేందుకు.. పాక్ సైనిక దళాలు ఎక్కడ కచ్ఛితంగా ఉన్నాయన్న విషయాన్ని తెలుసుకోవటానికి నావిగేషన్ వ్యవస్థ అవసరమైంది. ఈ సాంకేతికత అందుబాటులో ఉన్న అమెరికాను భారత్ సాయం కోరింది.
కానీ.. భారత్ కు సాయం చేయటానికి అమెరికా నిరాకరించింది. ఇరు దేశాల మధ్య యుద్ధం ముదరకుండా చేయాలనో.. పాకిస్థాన్ అనుకూలంగా ఉన్న కారణమో స్పష్టంగా చెప్పలేం కానీ.. కార్గిల్ లో శత్రుదేశాలు తిష్ట వేసిన సమాచారాన్ని ఇవ్వలేదు. దీన్నో గుణపాఠంగా భావించిన ఇస్రో.. అప్పటి నుంచి దేశీయంగా రూపొందించే నావిగేషన్ వ్యవస్థ మీద ఫోకస్ చేసింది. దాదాపు ఒకటిన్నర దశాబ్దాలకు పైగా చేసిన ప్రయత్నాలు ఫలించి.. ఒక స్వీట్ సక్సెస్ సొంతమయ్యేలా చేసింది.
ఇక.. ఈ ఉపగ్రహానికి నావిక్ అన్న పేరును నిర్ణయించటం వెనుక అసలు కారణం ఏమిటంటే.. కేవలం సూర్య చంద్రుల గమనం.. నక్షత్రాల్ని ఆధారంగా చేసుకొని వేలాదిమైళ్లు సముద్రయానం చేసిన మన పూర్వ నావికుల ధైర్యసాహసాలకు గుర్తుగా తాజా ఉపగ్రహానికి ‘‘నావిక్’’ అన్న పేరును డిసైడ్ చేశారు. తాజా ప్రయోగంతో.. సొంత నావిగేషన్ సౌకర్యం అందుబాటులోకి రావటమే కాదు.. మన చుట్టూ ఉన్న సార్క్ దేశాలకు సంబంధించి కూడా సేవల్ని అందించే వీలుంది. సెల్ ఫోన్లతో జీపీఎస్ సాయంతో ప్రయాణం చేస్తున్న మనం.. జూన్ నుంచి మన సొంత జీపీఎస్ ను వాడుకునే వీలుంది. తాజా ప్రయోగాన్ని తమ క్రెడిట్ గా చెప్పుకున్న ప్రధాని మోడీ.. ‘‘వాజ్ పేయ్ ప్రధానిగా ఉన్నప్పుడు సెల్ ఫోన్ సౌకర్యం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఆ సెల్ ఫోన్ సాయంతో గమ్యం చేరుకునే సమాచారాన్ని మా ప్రభుత్వం హయాంలో అందుబాటులోకి రావటం ఆనందంగా ఉంది’’ అని చెప్పుకొచ్చారు. మరో హ్యాపీ న్యూస్ ఏమిటంటే.. ఇలాంటి నావిగేషన్ సౌకర్యం ఉన్న దేశాలు ప్రపంచ వ్యాప్తంగా ఐదు మాత్రమే ఉన్నాయి. వాటి సరసన ఇప్పుడు భారత్ చేరింది. ఇంతకు మించిన గొప్పతనం ఇంకేం ఉంటుంది..?