Begin typing your search above and press return to search.

విలీన ఎంపీల‌తో మోడీ భేటీ!

By:  Tupaki Desk   |   21 Jun 2019 3:05 PM IST
విలీన ఎంపీల‌తో మోడీ భేటీ!
X
కొద్ది రోజుల క్రితం తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు దాదాపు డ‌జ‌ను మంది తెలంగాణ స్పీక‌ర్ కు నోట్ ఇవ్వ‌టం.. తాము అధికార టీఆర్ ఎస్ పార్టీలో చేరిపోతున్న‌ట్లుగా పేర్కొన్నారు. ఆ త‌ర్వాత ఆయ‌న ఓకే అన‌టం.. డ‌జ‌ను మంది కాంగ్రెస్ నేత‌లు టీఆర్ ఎస్ లో విలీనం కావ‌టం జ‌రిగిపోయాయి.

పార్టీలో విలీన‌మైన ఎమ్మెల్యేల‌ను తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి వెంట‌నే స‌మావేశ‌మ‌య్యే సాహ‌సం చేయ‌లేదు. పార్టీ మారిన ఎమ్మెల్యేల‌పై ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త ఉండ‌టం.. నిర‌స‌నలు.. ఆందోళ‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్న ప‌రిస్థితి. అన్నింటికి మించి.. సాంకేతికంగా పార్టీలో పార్ట్ అయిన నేత‌ల్ని ఇష్యూను లొల్లి చేయ‌టం ఎందుక‌న్న‌ట్ఉల‌గా వ్య‌వ‌హ‌రించార‌ని చెప్పాలి.

అందుకు భిన్నంగా.. తెగింపులో త‌న‌కు మించినోళ్లు ఎవ‌రూ ఉండ‌ర‌న్న విష‌యాన్ని ప్ర‌ధాని మోడీ తాజాగా ఫ్రూవ్ చేసేశారు. గురువారం రాత్రి ఏపీ టీడీపీకి చెందిన న‌లుగురు రాజ్య‌స‌భ స‌భ్యులు బీజేపీలో చేరుతున్న‌ట్లుగా లేఖ ఇచ్చారు. టీడీపీ ఎంపీల రిక్వెస్ట్ ను బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా ఓకే చేసేశారు. దీనిపై పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. మొన్న‌టికి మొన్న పార్టీ ఫిరాయింపులు.. విలీనాలు లాంటివాటిపై తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేసిన రాజ్య‌స‌భ ఉపాధ్య‌క్షుడు వెంక‌య్య‌నాయుడు తాజా వ్య‌వ‌హారంపై ఏమంటారు? అన్న‌ది ప్ర‌శ్న‌గా మారింది.

ఇదిలా ఉంటే.. టీడీపీ విలీన రాజ్య‌స‌భ స‌భ్యుల‌ను తాజాగా ప్ర‌ధాని భేటీ కావ‌టం ఆస‌క్తిక‌రంగానే కాదు.. త‌న తాజా చ‌ర్య‌తో దేశంలోని రాజ‌కీయ వ‌ర్గాల‌కు మోడీ స‌రికొత్త‌ సందేశాన్ని ఇచ్చార‌ని చెప్పాలి. రాజ్య‌స‌భ‌కు చెందిన ఒక పార్టీకి చెందిన న‌లుగురు ఎంపీలు పార్టీ నుంచి విలీనం ద్వారా చేరిన‌.. గంట‌ల వ్య‌వ‌ధిలో వారితో ప్ర‌ధాని స్థానంలో ఉన్న మోడీ ఏకంగా భేటీ కావ‌టం.. వారితో ఏపీలో పార్టీ భ‌విష్య‌త్తు ఏమిట‌న్న అంశంపై సీరియ‌స్ గా చ‌ర్చ జ‌ర‌ప‌టం చూస్తే.. ఏపీ విష‌యంలోనూ.. అందులోకి టీడీపీ విష‌యంలో మోడీషాలు ఎంత సీరియ‌స్ గా ఉన్నార‌న్న‌ద విష‌యం అర్థం కాక మాన‌దు.