Begin typing your search above and press return to search.
మన్‌కీ బాత్ ఎన్ని దేశాల్లో వింటారో తెలుసా
By: Tupaki Desk | 22 May 2017 2:13 PM ISTతన మాటలతో శ్రోతల్ని మంత్ర ముగ్థుల్ని చేసే ప్రధాని నరేంద్రమోడీ ఇమేజ్ అంతకంతకూ పెరుగుతోంది. ఆయన ప్రతి నెలా రేడియోలో చేసే ప్రసంగానికి వస్తున్న ఆదరణ అంతకంతకూ పెరుగుతోందట. ఆ విషయాన్ని ఆలిండియా రేడియో విదేశీ సేవల విభాగం డైరెక్టర్ అమ్లాన్ జ్యోతి చెబుతున్నారు. మోడీ మన్‌కీ బాత్‌కు దక్కుతున్న విశేష ఆదరణతో ఆయన ప్రసంగాన్నిహిందీకే పరిమితం చేయకుండా ఇంగ్లిష్.. రష్యన్.. ఫ్రెంచ్.. చైనీస్.. ఉర్దు తదితర భాషల్లోకి అనువాదం చేసి మరీ వినిపిస్తున్నట్లుగా చెబుతున్నారు. హిందీలో లైవ్‌లో ఇచ్చే ఈ కార్యక్రమాన్ని.. తర్వాత మిగిలిన భాషల్లోకి తర్జుమా చేస్తున్నారు.
ఒక రాజకీయ నాయకుడి మాదిరి కాకుండా ఒక వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా మాట్లాడే మోడీ మన్ కీ బాత్ ప్రస్తుతం 150 దేశాల్లో వింటున్నారని.. ఆయన ప్రసంగాలకు విశేషమైన ఆదరణ లభిస్తోందని చెబుతున్నారు. మన్‌కీ బాత్ ప్రసారమైన ప్రతిసారీ విదేశాల్లోని భారతీయుల్లో విశేషమైన స్పందన లభిస్తున్నట్లు చెబుతున్నారు. ఆయన ప్రసంగం విన్నాక తమ స్పందనల్ని పెద్ద ఎత్తున రేడియో స్టేషన్‌కి పంపుతున్నట్లుగా చెబుతున్నారు.
ఇలా స్పందిస్తున్న వారిలో గుజరాతీయులు ఎక్కువగా ఉన్నారని.. ఆ తర్వాత ఆఫ్రికా దేశాల నుంచి స్పందన అధికంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఆయన ప్రసంగంతో ఫిదా అవుతున్న వారు.. ప్రధాని మోడీ తమ దేశానికి ఎప్పుడొస్తారంటూ పలువురు ప్రవాస భారతీయులు లేఖలు రాస్తున్న విషయాన్ని అలిండియా రేడియో పేర్కొంది. ఇదిలా ఉంటే.. మోడీ ప్రధానమంత్రి అయ్యాక ఆయన పర్యటించి వచ్చిన దేశాల నుంచి పర్యాటకుల సంఖ్య బాగా పెరుగుతున్నట్లుగా తెలుస్తోంది. 2014లో ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఇప్పటివరకూ 55 విదేశీ పర్యటనలు చేశారు. ఆయన పర్యటించిన దేశాల నుంచి పర్యాటకులు దేశానికి అధికంగా రావటం గమనార్హం.