Begin typing your search above and press return to search.
మోడీ ఇప్పుడు ఫ్యాషన్ ఐకాన్ కూడా..!
By: Tupaki Desk | 15 Aug 2017 10:21 PM ISTప్రధాని నరేంద్ర మోడీ గురించి చెప్పాలంటే ఒక్రటెండు మాటలతో ముగించలేం. ఆయన గురించి చెప్పటం మొదలు పెడితే చాలానే చెప్పాల్సి ఉంటుంది. తన మాటలతో.. చేతలతో విలక్షణ నేతగా జనహృదయాల్లో నిలిచిన మోడీ ఇప్పుడు మరో కోణంలోనూ తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు.
గతంలో అమెరికా అధ్యక్ష పదవిలో ఉన్న బరాక్ ఒబామా వచ్చిన సందర్భంగా మోడీ డ్రెస్ సెన్స్ పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అమెరికా ఫస్ట్ లేడీని తలదన్నే రీతిలో గంటల చొప్పున డ్రెస్సలు మార్చేసిన మోడీ తీరుపై అప్పట్లో పలువురు తప్పు పట్టారు. దీనికి తోడు.. ఒక వ్యాపారవేత్త బంగారు తీగలతో తయారు చేయించిన డ్రెస్ ధరించటం కూడా వివాదంగా మారింది.
ఆ తర్వాత నుంచి డ్రెస్ సెన్స్ విషయంలో మోడీ జాగ్రత్తగావ్యవహరిస్తున్నారని చెప్పాలి. ఆడంబరంగా ఉండనప్పటికీ.. తనదైన ఫ్యాషన్ తో పలువురిని ఆకట్టుకుంటున్నారు. తాజాగా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆయన ధరించిన తలపాగా మరోసారి అందరి దృష్టిలో పడింది. మోడీ ఫ్యాషన్ ను చూస్తే.. భారత ప్రధమ ప్రధాని నెహ్రు తర్వాత మళ్లీ ఆ స్థాయిలో వస్త్రధారణ విషయంలో కేర్ తీసుకునే ప్రధానిగా మోడీ కనిపిస్తారు. సందర్భానికి తగినట్లుగా తన వస్త్రధారణ ఉండేలా ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న విషయం తెలుస్తుంది. మోస్ట్ ఫ్యాషన్ బుల్ ప్రధానిగా ఇప్పుడు పలువురు ప్రశంసలు అందుకుంటున్నారు.
ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటివరకూ నాలుగేళ్లలో పంద్రాగస్టు సందర్భంగా ఆయన వస్త్రధారణను చూస్తే.. మోడీ ఎంత ఫ్యాషనో ఇట్టే తెలుస్తుంది. తొలిసారి (2014) ఎర్రకోటను ఉద్దేశించి మోడీ ప్రసంగించిన సందర్భంగా రాజస్థానీల తరహాలో ఎర్రని తలపాగా ధరించారు. ఈ తరహా తలపాగాలు పశ్చిమ భారతావనిలో ఎక్కువగా ధరిస్తుండటం కనిపిస్తుంది.
ఇక.. 2015లో జరిగిన పంద్రాగస్టు వేడుకల సందర్భంగా ఎరుపు.. ఆకుపచ్చ వర్ణాలతో కూడిన తలపాగా ధరించటం కనిపిస్తుంది. తలపాగా కాళ్ల వరకూ వేలాడే పొడగాటి పంచె మాదిరి ఉండటం విశేషం. 2016లో రాజస్థానీల తరహాలో తలపాగా ధరించి ఎర్రకోట నుంచి ప్రసంగించారు. ఆ సంవత్సరంలో ఆయన ఎరుపు.. గులాబీ.. పసుపు వర్ణాల మిశ్రమంతో కూడిన తలపాగాను ధరించారు. గతంలోకంటే ఎక్కువ పొడవు ఉన్న పంచెను తలపాగాగా ధరించారు. ఈ ఏడాది విషయానికి వస్తే.. పసుపు.. ఎరుపు వర్ణాలతో కూడిన తలపాగాను ధరించారు. ఎప్పటిలానే తన వస్త్రధారణలో తలపాగా సో స్పెషల్ గా ఉండేలా జాగ్రత్త తీసుకున్న మోడీ కారులో నుంచి వేదికపైకి నడిచి వస్తుంటే.. అందరూ ఆయన తలపాగా వైపు అలా చూస్తుండిపోయారని చెప్పక తప్పదు.