Begin typing your search above and press return to search.

20వేల బిల్లు దాటిందా? ఐటీ పన్ను కట్టాల్సిందే?

By:  Tupaki Desk   |   14 Aug 2020 3:00 PM IST
20వేల బిల్లు దాటిందా? ఐటీ పన్ను కట్టాల్సిందే?
X
ప్రజలకు పంచడం కంటే.. ప్రజల నుంచి ఎలా గుంజాలనే దానిపైనే మోడీ సర్కార్ బాగా ఫోకస్ చేసినట్టు కనిపిస్తోంది. కొత్త పన్ను విధానం అంటూ మోడీ సార్ ఏకంగా కొత్త కొత్త ఆదాయ మార్గాలు వెతుకుతున్నారు. ఎక్కడ దొరికితే అక్కడ పన్ను బాదేయడానికి రెడీ అయ్యారు.

మోడీ సర్కార్ లో ఇప్పుడు కాదేది పన్నుకు అనర్హం అన్నట్టుగా పరిస్థితి మారుతోంది. తాజాగా ఆదాయ పన్ను శాఖ పరిధిలోకి కొత్త లావాదేవీలు తీసుకురావడానికి మోడీ సర్కార్ ప్రయత్నాలు చేస్తోంది.

ఏడాదికి రూ.20వేలు దాటితే హోటల్ బిల్లు- రూ.1 లక్ష దాటే విద్యుత్ బిల్లు.. నగల కొనుగోళ్లు, స్కూలు, కాలేజీ ఫీజులను పన్ను పరిధిలోకి తీసుకురావాలని నిర్ణయించారట..

ఇక అంతేకాదు.. దేశీయంగా.. విదేశాలకు జరిపే బిజినెస్ క్లాస్ విమాన ప్రయాణాలను కూడా పన్ను జాబితా పరిధిలోకి తీసుకొచ్చే ఆలోచనలు చేస్తోంది.

ఇలా ఏది దొరికితే అది.. సామాన్యులపై పన్నుల భారం మోపేందుకు మోడీ సర్కార్ సిద్ధమవుతోంది. దోపిడీకి కేరాఫ్ అడ్రస్ గా మారుతోందన్న విమర్శలు పన్ను చెల్లింపు దారుల నుంచి వినిపిస్తున్నాయి.