Begin typing your search above and press return to search.
మోడీ ఇచ్చిందేమిటి?.. తీసుకున్నదేమిటి?
By: Tupaki Desk | 24 Sept 2015 12:13 PM ISTతరచూ విదేశీ పర్యటనలు జరిపే ప్రధాని మోడీ ఉత్త చేతులతో వెళ్లరు. ఆయన తనతో పాటు విలువైన వస్తువుల్ని తీసుకెళుతుంటారు. భారీ బహుమతుల కంటే కూడా.. అత్యంత విలువైన.. అపురూప బహుమతుల్ని తీసుకెళ్లటం మామూలే. తాజాగా ఐర్లాండ్.. అమెరికా పర్యటనల్లో ఉన్న మోడీ తనతో విలువైన బహుమతుల్ని తీసుకెళ్లినట్లు చెబుతున్నారు.
ఐర్లాండ్ అతిధ్యాన్ని పొందిన మోడీ.. తన గుర్తుగా ఐర్లాండ్ ప్రధాని ఎండా కెన్నికి విలువైన పత్రాల్ని అందించినట్లు చెబుతున్నారు. అదే సమయంలో కెన్ని నుంచి వినూత్నమైన బహుమతులు మోడీ పొందినట్లు చెబుతున్నారు. 60 ఏళ్ల తర్వాత భారతదేశ ప్రధాని ఒకరు ఐర్లాండ్ లో పర్యటన చేయటం తొలిసారి. ఈ విషయాన్ని మోడీ అండ్ కో మాటల్లోనే కాదు.. దౌత్య వర్గాలు కూడా ఇదే విషయాన్ని ఘనంగా ప్రకటించారు. ధశాబ్దాల అనంతరం వచ్చిన భారతదేశ ప్రధాని మోడీకి ఐర్లాండ్ లో ఘన స్వాగతం లభించింది.
మోడీకి ఐర్లాండ్ ప్రధాని కెన్ని.. ఆ దేశ జాతీయ క్రీడ అయిన హర్లింగ్ బ్యాట్.. బంతి.. జాతీయ జట్టు జెర్సీలను బహుమతులుగా ఇచ్చినట్లుగా చెబుతున్నారు. ఇచ్చినమ్మ వాయినమ్మ.. పుచ్చుకుంటినమ్మ వాయినం అన్న చందంగా ఫారిన్ టూర్ల సందర్భంగా ఇచ్చిపుచ్చుకోవటం బాగానే ఉందంటున్నారు. మరి.. మీరేమంటారు..?