Begin typing your search above and press return to search.

మాటలతో మరోసారి మనసు దోచేసిన మోడీ

By:  Tupaki Desk   |   8 Sept 2019 9:48 PM IST
మాటలతో మరోసారి మనసు దోచేసిన మోడీ
X
మోడీ మాటలు ఎంత ఉత్తేజితంగా ఉంటాయో చెప్పాల్సిన అవసరమే లేదు. మోడీని వ్యతిరేకించే హార్డ్ కోర్ లను వదిలేస్తే.. సామాన్యుల్ని.. సాదాసీదా ప్రజలంతా మాత్రం ఆయన మాటలకు తరచూ మైమరిపోతుంటారు. ఎప్పుడేం మాట్లాడాలి. మాటలతో మనసుల్ని ఎలా గెలుచుకోవాలన్న విషయంలో మోడీ మాస్టర్ గా చెప్పక తప్పదు. చంద్రయాన్ 2 ప్రయోగంలో ఊహించని రీతిలో పరిణామం చోటు చేసుుకున్న వేళ.. గతంలో మాదిరి మౌనంగా అక్కడి నుంచి వచ్చేసే ప్రముఖులకు భిన్నంగా మోడీ అక్కడే ఉండటం.. పొద్దున్నే శాస్త్రవేత్తలతో మీటింగ్ పెట్టి.. వారిని ఉత్తేజితుల్ని చేయటమే కాదు. దేశ ప్రజల మనసుల్ని దోచేశారు.

తన ప్రసంగం తర్వాత వేదిక దిగి.. ఇస్రో ఛైర్మన్ దగ్గరకు వెళ్లి.. ఆయన వెన్నను సర్దటం.. కన్నీళ్లు పెట్టుకున్న ఆయన్ను ఓదార్చటం చేయటం ద్వారా కోట్లాది ప్రజల మనసుల్ని దోచేశాడు. అయితే.. మోడీ చర్యను తప్పు పట్టినోళ్లు.. ఇస్రోఛైర్మన్ వెన్ను నిమురుతాడా? మోడీ స్థాయి ఏంటంటూ రంకెలు వేసిన మహా పుడింగి బుద్ధ జీవుల్ని మినహాయిస్తే.. ఈ చర్య అందరిలోనూ కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది.

ఇదిలా ఉంటే.. ఈ రోజు మోడీ హర్యానాలో ఎన్నికల ప్రచారాన్ని లాంఛనంగా షురూ చేశారు. బీజేపీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ కట్టర్ చేపట్టిన జన్ ఆశీర్వాద్ యాత్ర ముగింపు సభలో పాల్గొని ప్రసంగించారు. కొద్ది నెలల క్రితమే తాను రోహతక్ లో పర్యటించానని.. ఈసారి మరింత మద్దతు కోరేందుకు తాను వచ్చినట్లు చెప్పారు.

రోహతక్ ప్రజలు తానేమీ అడిగినా.. అడిగిన దాని కంటే ఎక్కువ ఇస్తారంటూ తానేం కోరుకుంటున్న విషయాన్ని చెప్పేశారు. జమ్ముకశ్మీర్ లో ఆర్టికల్ 370 నిర్వీర్యంపై మాట్లాడుతూ.. దేశంలోని 130 కోట్ల మంది ప్రజల సమస్యకు కొత్త పరిష్కారాల అన్వేషణను ప్రారంభించినట్లు చెప్పారు.

చంద్రయాన్ 2 మిషన్ పైనా ఆయన వ్యాఖ్యలు చేశారు. నిర్దేశిత లక్ష్యాన్ని సాధించకపోవటాన్ని బ్యాడ్ లక్ గా అభివర్ణించిన ఆయన.. ఆ మిషన్ కారణంగా యావద్దేశం ఏకతాటిపైకి వచ్చిందన్నారు. చంద్రయాన్ ప్రయోగాన్ిన తిలకించేందుకు తెల్లవారుజామున 1.50 గంటల నుంచి దేశ ప్రజలు టీవీలకు అతుక్కుపోయారన్నారు. ఒక ఘటన యావద్దేశాన్ని ఎలా మేలుకునేలా చేసిందో తాను ఆ వంద నిమిషాల్లో చూశారన్నారు.

స్పోర్ట్స్ మన్ స్పిరిట్ అనే మాట తరచూ వినిపిస్తూ ఉంటుందని.. తాజాగా హిందుస్థాన్ లో ఇప్పుడు ఇస్రో స్ఫూర్తి అందర్లో కనిపిస్తుందన్నారు. ఎన్నికల ప్రచార సభ అన్నంతనే రాజకీయాలు మాట్లాడటం.. ప్రత్యర్థుల మీద విరుచుకుపడటానికి భిన్నంగా.. కరెంట్ టాపిక్స్ మాట్లాడటం ద్వారా తన పాలనలోని పాజిటివ్ కోణాన్ని చెప్పకనే చెప్పేశారని చెప్పారు. మరో నెలలో జరగాల్సిన హర్యానా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రచార సభలో వినూత్నంగా ప్రసంగించటం ద్వారా తన రూటు సపరేటు అన్న విషయాన్ని మోడీ చెప్పకనే చెప్పేశారని చెప్పాలి.